ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

market: సంతల్లో సంక్రాంతి సందడి

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:48 PM

market:జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి, జలుమూరు మండలంలోని నారాయణవలసలో గురువారం జరిగిన సంతల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఒడిశా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రయ విక్రయదారులతో కిటకిటలాడాయి. ప్రధానంగా పొట్టేళ్లు, నాటు కోళ్లకి గిరాకీ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలుపెంచేశారని వినియోగదారులు వాపోయారు.

జలుమూరు: క్రయవిక్రయదారులతో కిటకిటలాడుతున్న నారాయణవలస సంత

జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి, జలుమూరు మండలంలోని నారాయణవలసలో గురువారం జరిగిన సంతల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఒడిశా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రయ విక్రయదారులతో కిటకిటలాడాయి. ప్రధానంగా పొట్టేళ్లు, నాటు కోళ్లకి గిరాకీ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలుపెంచేశారని వినియోగదారులు వాపోయారు.

జలుమూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) నారాయణవలస సంతకు సంక్రాంతి పురస్కరించుకుని పెద్దసంఖ్యలో వినియోగదారులు తరలి వచ్చారు. సంక్రాంతి, కనుమ ముందు సంత కావడంతో పొట్టేళ్లు, మేకపోతులు, నాటు కోళ్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ప్రజలు అవసరాలను వ్యాపారులు ఆసరాగా తీసుకొని కొనుగోలు దారులను ధర పెంచేశారు. 10 కేజీల పొట్టేళ్లు, మేకపోతులు 13 వేలు రూపాయలు పైనే ధర పలికాయి. నాటు కోళ్లు కేజీ రు.800లు ధర పలికింది. కూరగాయలు, చెరుకులు, కొబ్బరికాయలు ధరలు ఆకాశాన్నంటాయి.

ఫవజ్రపుకొత్తూరు,జనవరి 9(ఆంధ్రజ్ర్యోతి):మండలంలోని పూండి వారపు సంతలో సంక్రాంతి సందడినెలకొంది. ప్రతిగురువారం పూం డిలో అయ్యప్ప ఆలయం సమీపంలో వారపు సంతను శతాబ్దకాలంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. సంక్రాంతి ముందు వారపు సంత కావడంతో నందిగాం,పలాస, వజ్రపుకొత్తూరమండలాల్లోని పలు గ్రా మాల ప్రజలు ఉదయం నుంచి తరలివచ్చి సరుకులు కొనుగో లు చేశారు. ఇక్కడకు జిల్లాలోని పలు మండలాల నుంచి వ్యాపారులు సరుకులు, కోళ్లు, మట్టి కుండలు పలు రకాల సామగ్రి తీసుకొచ్చి విక్రయించారు..

Updated Date - Jan 09 , 2025 | 11:48 PM