ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

ABN, Publish Date - Jan 18 , 2025 | 11:49 PM

పోలీసు కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లసాయుధ పోలీసు మైదా నంలో నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షలు శనివారం ముగిశాయి.

దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

ఎచ్చెర్ల, జనవరి 18(ఆంధ్ర జ్యోతి): పోలీసు కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లసాయుధ పోలీసు మైదా నంలో నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షలు శనివారం ముగిశాయి. గతనెల 30న ప్రా రంభమైన ఈప్రక్రియ 13 రో జుల పాటు కొనసాగింది. 100, 1600 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌తో పాటు ఛాతీ, ఎత్తు కొల తలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. లాంగ్‌జంప్‌కు మినహా మిగిలిన విభాగాల పరీక్షలకు సెన్సార్‌లు వినియోగించారు. చివరిరోజున శనివారం నిర్ధేశించిన అభ్య ర్థులతోపాటు అనివార్య కారణాల వల్ల హాజరుకాని అభ్యర్థులు కూడా హాజరయ్యా రు. శనివారం 416 మంది అభ్యర్ధులు హాజరుకావల్సి ఉండగా, 336 మంది హాజ రయ్యారు. ఇందులో 204 మంది అర్హత సాధించారు. 13 రోజులపాటు జరిగిన ఈ పరీక్షల్లో మొత్తం 4,952 మంది అభ్య ర్థులు హాజరుకాగా,వీరిలో 2,951మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. అయితే రాత పరీక్షకు అర్హతసాధించిన వారి వివరాలను అధికారికంగా ప్రకటించాల్సిఉంది.

Updated Date - Jan 18 , 2025 | 11:49 PM