agreement కుదిరిన వేతన ఒప్పందం
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:20 AM
agreement వేతన ఒప్పందం విషయంలో రైస్‌మిల్లు కార్మికులకు, మిల్లు యాజమాన్యాల మధ్య నెలకొన్న వివా దం ఎట్టకేలకు ముగిసింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనంపై 19.5 శాతం పెంచేందుకు యాజ మాన్యాలు అంగీకరించడంతో 25 రోజుల సమ్మె కు కార్మికులు ముగింపు పలికారు.
25 రోజుల రైస్ మిల్లు కార్మికుల సమ్మెకు తెర
పలాస, మార్చి 7(ఆంధ్రజ్యోతి): వేతన ఒప్పందం విషయంలో రైస్‌మిల్లు కార్మికులకు, మిల్లు యాజమాన్యాల మధ్య నెలకొన్న వివా దం ఎట్టకేలకు ముగిసింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనంపై 19.5 శాతం పెంచేందుకు యాజ మాన్యాలు అంగీకరించడంతో 25 రోజుల సమ్మె కు కార్మికులు ముగింపు పలికారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శాసనపురి మురళీకృష్ణ, మందస రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇప్పిలి వెంకటేశ్వరరావు, సీఐ టీయూ అధ్యక్షుడు ఎన్.గణపతి, జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావు, కార్మికులతో కలిసి రౌండ్‌టేబుల్ సమా వేశం నిర్వహించారు. ఇరువర్గాల మధ్య అంగీకారం కుదరడంతో సమ్మె ముగిస్తున్నట్లు కార్మికులు ప్రకటిం చారు. వేతనాలు పెంచాలని కోరుతూ మండల రైస్ మిల్లు కార్మికులు సమ్మెబా ట పట్టారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘ నేతలు, మిల్లుల యూనియన్ ప్రతినిధుల మధ్య సమా వేశాలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. కార్మి కులు కనీసం 25 శాతం వేతనం పెంచాలని డిమాం డ్ చేశారు. ఈ నేపథ్యం లో టీడీపీ నేత వెంకన్నచౌదరి సూచనల మేరకు 19.5 శాతం వేతనం పెంచేందుకు యాజమా న్యాలు అంగీకరించడంతో ఇరువర్గా లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శాసనపురి మురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ.. జలమైన సమస్య ఎంతో మంచి వాతావరణం మఽధ్య నేతల సమన్వయంతో పరిష్క రించడం జరిగిందని, కార్మికులకు వ్యాపార సంఘం పూర్తిగా అండగా ఉంటుంద న్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నేతలు కె.కేశవ రావు, బి.మల్లేసు, లచ్చయ్య, కె.బాలకృష్ణ, రైస్ మిల్లుల యజ మానులు వి.జగదీష్, వీరభద్రరావు, వి.శివ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 12:20 AM