Secretariat సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:34 AM
మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 10 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయానికి 10 విభాగా లకు సంబంధించి కార్యదర్శులను నియమిం చింది.
ఇచ్ఛాపురం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 10 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయానికి 10 విభాగా లకు సంబంధించి కార్యదర్శులను నియమిం చింది. ఇలా చూసుకుంటే అన్ని సచివాలయా లు కలుపుకొని 100 మంది ఉండాలి కానీ సగం మందే ఉన్నారు. ప్రస్తుతం ఆ స్థానాల్లో కొంత మంది ఇన్‌చార్జీలు ఉంటున్నారు. వీరు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విధుల్లో ఉండాలి. ఏదైనా ప్రభుత్వ లేదా ఇతర అత్యవసర సమయాల్లో బయటకు వెల్లాల్సి ఉంటే కచ్చితంగా బుక్‌లో కారణం రాసి వెళ్లాలి. అయితే కొందరు సచివాలయ ఉద్యోగులు దీని ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వాన్ని, ప్రజలను మోసగిస్తున్నారు. కార్యాలయానికి రావడంతో నే ఏదో ప్రభుత్వ కార్యక్రమం అంటూ సాకు చెప్పి బయటకు వెళ్లిసొంత పనుల్లో నిమగ్న మవుతున్నారు. వివిధ సేవలపై వచ్చే అర్జీదా రులకు చుక్కలు కనబడుతున్నాయి. ఈ క్ర మంలోనే శుక్రవారం పంజావీధి సచివాలయం లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉన్నారు. మిగ తా వారు ఎక్కడకు వెళ్లారని అడిగేవారే లేక పోవడంతో ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు. ఇదొక్కటే కాదు పట్టణ పరిధిలోని చాలా సచివాలయాల పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షిస్తాం
సచివాలయాల్లో సిబ్బంది కొరత వల్ల కొంత సమస్య ఎదురవుతుంది. మున్సిపాల్టీ పరిధి లోని పది సచివాలయాల పరిధిలో 100 మం ది సిబ్బంది ఉండాలి. కానీ 60మందితోనే నె ట్టుకొస్తున్నాం. ప్రభుత్వ సర్వేలు కారణంగా సి బ్బంది చాలావరకు ఫీల్డ్‌లోనే ఉండాల్సి వస్తుం ది. సర్వేలు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో కార్యాలయాల్లో ఉండేలా చర్యలు తీసుకుం టాం. ఎప్పటికప్పుడు సచివాలయాలు పర్యవేక్షి స్తాం. సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం.
- ఎన్.రమేష్, మున్సిపల్ కమిషనర్
Updated Date - Mar 08 , 2025 | 12:34 AM