Mahatma మహాత్ముడి అడుగుజాడల్లో నడుద్దాం
ABN, Publish Date - Jan 31 , 2025 | 12:14 AM
మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుద్దామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అన్నారు.
గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే సత్యవతి
మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి
ఆమదాలవలస, జనవరి 30(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుద్దామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. గురువారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణం లోని వన్‌వే జంక్షన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ స్ఫూర్తి ఆశయాల వల్లనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నేటి యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా సాగాలన్నారు. కార్య క్రమంలో కాంగ్రెస్ నాయకులు లఖినేని నారాయణరావు, షన్ముఖరావు, రాజులు, రమణ, సాయిరాం, అప్పారావు, కృష్ణమూర్తి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 31 , 2025 | 12:14 AM