ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

inter exams ఇంటర్‌ పరీక్షలకు వేళాయే

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:23 AM

ఇంట ర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులు సన్న ద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి వార్షిక పరీక్షల నిర్వహణ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ విద్యా మండలి ఇప్పటికే ప్రకటించింది.

  • నేడు నైతికత - మానవత విలువలపై..

  • 3న పర్యావరణంపై..

  • వచ్చే నెల 1 నుంచి థియరీ

సోంపేట, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఇంట ర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులు సన్న ద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి వార్షిక పరీక్షల నిర్వహణ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ విద్యా మండలి ఇప్పటికే ప్రకటించింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 1న నైతికత - మానవ విలువలపైన, 3న పర్యావరణంపై పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ, థియరీ ప రీక్షలతోపాటు ఈ రెండింట్లో పాసైతేనే ఇంట ర్మీడియట్‌ పూర్తి అయినట్టు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ వృత్తివిద్యా కోర్సుల వారికి ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు 114 కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ఉయదం 8 గంటల నుంచి 12గంటల వరకు మధ్యా హ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహిస్తారు. జిల్లాలో 164 ప్రభుత్వ, ప్రైవే టు జూనియర్‌ కళాశాలల్లో 39,470మంది చదువుతున్నారు. ఇందులో మొదటి సంవ త్సరంలో 20,678 మంది, ద్వితీయ సంవ త్సరంలో 18,792మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ప్రయోగ పరీక్షలకు 21,109 హాజరుకానున్నారు. వీరిలో వృక్ష, జం తు శాస్త్ర పరీక్షలకు 5,133 మంది, భౌతిక, రసాయన శాస్త్ర పరీక్షలకు 15,976మంది హా జరు కానున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఐవో దుర్గారావు మాట్లాడుతూ.. ఇంటర్‌ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూ ర్తి చేశామన్నారు. థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జంబ్లింగ్‌ విధానంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇన్విజిలేట ర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.

Updated Date - Feb 01 , 2025 | 12:23 AM