PDS rice 2,700 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN, Publish Date - Mar 05 , 2025 | 11:58 PM
PDS rice అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవని ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి.ప్రసాదరావు అన్నారు. ఓ వాహనంలో తరలిస్తున్న 2700 కిలోల పీడీఎస్ బియ్యాన్ని అంపోలు జంక్షన్ వద్ద విజిలెన్స్, రెవెన్యూ అధి కారులు సంయు క్తంగా బుధవారం పట్టుకున్నారు.
శ్రీకాకుళం క్రైం/గార, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవని ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి.ప్రసాదరావు అన్నారు. ఓ వాహనంలో తరలిస్తున్న 2700 కిలోల పీడీఎస్ బియ్యాన్ని అంపోలు జంక్షన్ వద్ద విజిలెన్స్, రెవెన్యూ అధి కారులు సంయు క్తంగా బుధవారం పట్టుకున్నారు. డ్రైవర్ పి.వినోద్‌ను విచారించగా.. నడగాం గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీరామ్మూర్తి ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని కోళ్ల ఫారాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో రూ.1,22, 850 విలువైన 2700 కిలోల బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఆర్‌ఐ యు.వెంకటేష్, విజిలెన్స్ ఎస్‌ఐ రామారావు, సిబ్బంది ఈశ్వరరావు, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Mar 05 , 2025 | 11:58 PM