ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:11 AM

రాష్ట్రంలో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూటమి ప్రభుత్వ కల్పించనున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూటమి ప్రభుత్వ కల్పించనున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. సోమవారం ఆర్టీసీ డిపో ఆవరణలో కొత్తగా మంజూరైన నాలుగు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సు సర్వీసులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే ఏపీ ఎస్‌ఆర్టీసీ మంచి సేవలు అందిస్తోందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లాభాల బాట లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రయాణికులకు మెరు గైన సేవలు అందించడమే ఆర్టీసీ ధ్యేయమని, వీటిని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆమె ఆర్టీసీ బస్సులో రెండు కిలో మీటర్లు ప్రయాణించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూ రావు, డీఎం ఆర్‌.సీతారామ నాయుడు, ఏడీఎం ఆర్‌.సంతోష్‌ కుమార్‌, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, పట్టణ కార్యదర్శి సప్ప నవీన్‌, సీనియర్‌ నాయకుడు ఎం.నరేంద్ర (చిన్ని), జోగ మల్లి, కొరికాన శంకర్‌, కార్మిక సంఘ నాయకులు పి.వాలి, దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:11 AM