Different talents అన్ని రంగాల్లో రాణిస్తున్న విభిన్న ప్రతిభావంతులు
ABN, Publish Date - Jan 04 , 2025 | 11:57 PM
విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని డీఆర్డీఏ పీడీ కిరణ్‌కు మార్ అన్నారు. డీఆర్డీఏ కాంపెక్స్‌లో శనివారం ని ర్వహించిన లూయీ బ్రెయిలీ జయంతి వేడుక ల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
అరసవల్లి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని డీఆర్డీఏ పీడీ కిరణ్‌కు మార్ అన్నారు. డీఆర్డీఏ కాంపెక్స్‌లో శనివారం ని ర్వహించిన లూయీ బ్రెయిలీ జయంతి వేడుక ల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులు ఉన్నత ఉద్యోగాలు పొందగలిగారంటే అందుకు లూయీస్ బ్రెయిలీ కారణమన్నారు. తొలుత బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏడీ కవిత, డీఐపీఆర్‌వో కె.చెన్నకేశవరావు, సెట్విన్ సీఈవో ప్రసాదరావు, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు.
- ఇచ్ఛాపురం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచ బ్రెయిలీ జయంతి ముత్యా లమ్మపేట భవిత కేంద్రంలో శనివారం ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ఎంఈవో-2 ఎస్.విశ్వనాథం, ఉపాధ్యాయులు ఉదయ్‌బాస్కర్, నాగమణి, ఎంఆర్‌సీ సిబ్బంది కామేష్, రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 04 , 2025 | 11:57 PM