రైల్వే అండర్ పాసేజ్ నిర్మించండి
ABN, Publish Date - Feb 03 , 2025 | 11:44 PM
ఇచ్ఛాఫురం నుంచి కొళిగాం వెళ్లే మార్గం లో రైల్వే అండర్ పాసేజ్ నిర్మించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు డిమాండ్‌చేశారు.
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాఫురం నుంచి కొళిగాం వెళ్లే మార్గం లో రైల్వే అండర్ పాసేజ్ నిర్మించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు డిమాండ్‌చేశారు.ఇక్కడ పాసేజ్ లేకపోవడంతో వాహనచోదకులు, విద్యార్థు లు, చుట్టుపక్కల 30గ్రామాలప్రజలు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. ఈమేరకు సోమవారం ఇచ్ఛాపురంలో రైల్వే ఎల్‌సీగేటు వద్ద జనసేన నాయకులు, వివిద కళాశాలల విద్యార్థులు, ఆటో, ట్యాక్సీ యూనియన్ల నాయకులు ఉదయం 10 గం టల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రతి 20 నిమిషాలకు గేట్ పడడం వల్ల అత్యవసర సమయాల్లో రోగులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.అనంతరం జీఎం పరమేశ్వర్ ఫక్వాల్‌ను కలిసి వినతిపత్రం అందజేసి అండర్‌పాస్ లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అండర్‌పాసేజ్ నిర్మాణానికి అవకాశముంటే పరిశీలి స్తామని, ప్రస్తుతం ఆర్‌వోబీ నిర్మిస్తామని తెలిపారు.
Updated Date - Feb 03 , 2025 | 11:44 PM