సోషల్ ఆడిట్ పక్కాగా నిర్వహించండి
ABN, Publish Date - Feb 05 , 2025 | 11:37 PM
మం డలంలో ఏప్రిల్, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వరకు జరిగిన ఉపాధిహామీ పథ కం పనులపై సోషల్‌ఆడిట్ క్షేత్రస్థాయిలో పక్కాగా నిర్వహించాలని డ్వామాజిల్లా విజి లెన్స్ మేనేజర్ స్వరూపారాణి కోరారు.
టెక్కలి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మం డలంలో ఏప్రిల్, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వరకు జరిగిన ఉపాధిహామీ పథ కం పనులపై సోషల్‌ఆడిట్ క్షేత్రస్థాయిలో పక్కాగా నిర్వహించాలని డ్వామాజిల్లా విజి లెన్స్ మేనేజర్ స్వరూపారాణి కోరారు. బుధ వారం స్థానికమండలపరిషత్ కార్యాలయం లో కార్యదర్శులు,ఇంజనీరింగ్, ఫీల్డ్‌అసి స్టెం ట్లు,సిబ్బందితో సమీక్షించారు. ఈసందర్భం గా మాట్లాడుతూ మండలంలో రూ.18 కోట్ల నిధులు వివిధరూపాల్లో వెచ్చించామని, ఎస్‌ఆర్‌పీ, ఆరుగురు డీఆర్పీలు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి ప్రజావేదికకు రిపోర్టు సిద్ధంచేయాలన్నారు. 15 రోజుల పాటు గ్రామాల్లో సోషల్‌ఆడిట్ బృందం విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింతాడ లక్ష్మీ భాయి, ఏపీడీశైలజ, ఏపీవో ప్రసాద్, ఎస్‌ఆర్‌పీ రామచంద్రరావు పాల్గొన్నారు.
Updated Date - Feb 05 , 2025 | 11:37 PM