వ్యక్తిపై దాడి
ABN, Publish Date - Jan 20 , 2025 | 11:25 PM
స్థానిక దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరు పతిరావుపై గుర్తుతెలియని వ్యక్తి సోమవారం వేకువ జామున కత్తితో దాడికి పాల్పడ్డాడు.
పాతపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరు పతిరావుపై గుర్తుతెలియని వ్యక్తి సోమవారం వేకువ జామున కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారి గ్రామంలో కలకలం రేగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తిరుపతిరావు, భార్య, కుమారుడితో కలిసి ఇంట్లో ఉంటున్నారు. సోమవారం గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరుని ఆలయానికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు వేకువజామున స్నానాలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈలోగా ఇంటి పైనుంచి ఓ వ్యక్తి ఇంటిలో చొరబడి నిద్రలో ఉన్న తిరుపతిరావును చాకుతో మెడ వద్ద కోసే ప్రయత్నం చేశాడు. మెలకువ వచ్చిన తిరుపతిరావు ప్రతిఘ టించాడు. అయినా సదరు దుండగుడు చాకుతో మెడ వద్ద కోసే ప్రయత్నం కొన సాగించాడు. నిందితుడు ముఖం గుర్తించకుండా ముసుగు వేసుకుని ఉన్నా డు. లుంగీ, షర్టు ధరించి ఉన్నాడు. ఈ పెనుగులాట, దాడిలో తిరుప తిరావు రెండు చేతులకు గాయాలయ్యాయి. తన ప్రయత్నం విఫలమవుతోందని గ్రహించి సదరు వ్యక్తి ఇంటి మధ్య ఉన్న మెట్ల గుండా పైకి వెళ్లి తప్పించు కున్నాడు. గాయపడిన తిరుపతిరావు ద్విచక్రవాహనంపై సీహెచ్‌సీకి వెళ్లా రు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలుపగా సీఐ వి.రామాావు సీ హెచ్‌సీకి చేరుకుని వాంగ్మూలం తీసుకున్నారు. ఘటనా ప్రాంతానికి వెళ్లి పరి శీలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు. అయితే ఈ దాడి రాజకీయకక్ష లతోనే చేసి ఉంటారని బాధితుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
దాడి కేసులో ఆరుగురి అరెస్టు
నందిగాం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నందిగాం ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన దాడి కేసుకు సంబంధించి ఒక వర్గానికి చెందిన ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుపై పది మందిపై కేసు నమోదు చేసిన విషయం పాఠకులకు విదితమే. దీనికి సంబంధించి ఒక వర్గానికి చెందిన జడ్యాడ జయరాంతో పాటు మరో ఐదుగురిని అరెస్టుచేసి టెక్కలి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మాకివలసలో ఇద్దరు..
నరసన్నపేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మాకివలస గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. గ్రామానికి చెందిన తండ్యాల రమణ వద్ద 13 మద్యం సీసాలు, బంటుపల్లి శ్రీను వద్ద 22 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Updated Date - Jan 20 , 2025 | 11:25 PM