ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Died చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN, Publish Date - Mar 08 , 2025 | 12:15 AM

ఇలిసిపురం సమీపంలో ఈ నెల 5న గుర్తుతెలియని ఓ వ్యక్తి గాయపడి ఉండడంతో అతడిని టూటౌన్‌ పోలీసులు చికిత్స నిమిత్తం రిమ్స్‌లో చేర్పించారు.

శ్రీకాకుళం క్రైం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఇలిసిపురం సమీపంలో ఈ నెల 5న గుర్తుతెలియని ఓ వ్యక్తి గాయపడి ఉండడంతో అతడిని టూటౌన్‌ పోలీసులు చికిత్స నిమిత్తం రిమ్స్‌లో చేర్పించారు. అత్యవసర చికి త్స నిమిత్తం అతడిని 6న కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్టు టూటౌన్‌ సీఐ ఈశ్వర రావు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఆచూకీ తెలియకపోవడంతో మృత దేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, ఆచూకి తెలిసిన వారు టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించాలని కోరారు.

చికిత్స పొందుతూ ఇచ్ఛాపురం వాసి..

భోగాపురం, మార్చి7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అమటాం రాయ వలస సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై తగరపువలసలోని ప్రైవేట్‌ ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన పాం డ్య జ్యోతేంద్రనారాయణ(42) గురువారం రాత్రి మృతి చెందాడని సీఐ ఎన్వీ ప్రభాకర్‌ తెలిపారు. పాండ్య జ్యోతేంద్రనారాయణ ప్రస్తుతం విశాఖలో నివా సం ఉంటున్నాడన్నారు. ఈనెల 5న శ్రీకాకుళం వెళ్లి ద్విచక్రవాహనంపై విశా ఖ వస్తుండగా అమటాం రాయవలస సమీపంలో ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొన్న సంగతి తెలిసిందే. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

అమ్మవారి గుడిలో దొంగతనం

వజ్రపుకొత్తూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సుంకరజగన్నాథపురం విజయ కనకదుర్గా అమ్మవారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు ఆలయం తాళాలు పగులగొట్టి వెండి, బంగారు ఆభరణాలు అపహ రించారు. శుక్రవారం ఉదయం గుడిదాసురాలు గాడి హైమావతి ఆల యానికి వచ్చి చూడగా తాళం పగలు గొట్టి ఉండడాన్ని గమనించి చోరీ జరి గిందని గుర్తించి గ్రామ స్థులకు చెప్పింది. వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ జూన్నారావు ఘటనా ప్రదేశానికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ చోరిలో 300 గ్రాముల వెండి, అరతులం బంగా రం దొంగలు ఎత్తుకుపోయనట్లు ఎఎస్‌ఐ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Mar 08 , 2025 | 12:16 AM