ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Traffic Rules నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ABN, Publish Date - Feb 21 , 2025 | 11:48 PM

Traffic Rules వాహనాలు నడిపే వారంతా నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే అపరాధ రుసుం వేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆమదాలవలస సీఐ సత్యనారాయణ స్పష్టం చేశారు.

వాహనదారులతో మాట్లాడుతున్న సీఐ సత్యనారాయణ

ఎల్‌.ఎన్‌.పేట, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): వాహనాలు నడిపే వారంతా నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే అపరాధ రుసుం వేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆమదాలవలస సీఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. లక్ష్మీనర్సుపేట జంక్షన్‌లో శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. సీ బుక్‌, ఇన్స్యూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్సులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాటి నివారణకు చర్యలు చేపడుతున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిమితికి మించి వాహ నాల్లో ప్రయాణించినా, అతి వేగంతో వాహనాలు నడిపినా, మైనర్లు డ్రైవింగ్‌ చేసినా చర్యలు తప్పవన్నారు. ఆయనతోపాటు సరుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 11:48 PM