ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఢీకొన్న లారీ.. బోల్తాపడిన ట్రాక్టర్‌

ABN, Publish Date - Feb 22 , 2025 | 11:42 PM

జాతీయ రహదారి కర జాడ గ్రామం వద్ద లారీ ఢీకొని ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

బోల్తాపడిన ట్రాక్టర్‌

శ్రీకాకుళం రూరల్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి కర జాడ గ్రామం వద్ద లారీ ఢీకొని ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ కె.రాము తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం నర్సాపురం అగ్రహారం గ్రామానికి చెందిన పిన్నింటి వెంకినాయుడు(45), రమణమ్మ, దుర్గమ్మ హైవే రోడ్డు మరమ్మతు పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ట్రాక్టర్‌పై వెళ్లి కరజాడ వద్ద ఫ్లై ఓవర్‌పై మరమ్మతు పనులు చేసి తిరిగి సాయంత్రం వస్తున్నారు. ఇదే సమయంలో నరసన్నపేట నుంచి విశాఖ వైపు వస్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వెంకినాయుడు అక్కడికక్కడే మృతి చెందగా, రమణమ్మ, దుర్గ మ్మ, ట్రాక్టర్‌ డ్రైవర్‌ సందీప్‌శర్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమా చారం మేరకు రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 22 , 2025 | 11:42 PM