ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganjayi 4.596 కేజీల గంజాయి స్వాధీనం

ABN, Publish Date - Mar 08 , 2025 | 11:53 PM

Ganjayi ఆంధ్రా ఒడిశా సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 4 కేజీల 596 గ్రాముల గం జాయిని స్వాధీనం చేసు కున్నట్లు సీఐ వి. రామారావు తెలిపారు.

తమిళనాడు వాసి అరెస్ట్‌

పాతపట్నం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా ఒడిశా సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 4 కేజీల 596 గ్రాముల గం జాయిని స్వాధీనం చేసు కున్నట్లు సీఐ వి. రామారావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ వివరాలు వెల్లడించారు. ఆ మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరు వెల్లూరు జిల్లా తిరుమళ్లైయాల్‌ గ్రామ సన్నతి వీధికి చెందిన ధనుష్‌ ఏకాం బరం అనే యువకుడు ఒడిశాలోని బల్లిగూడ ప్రాంతానికి చెందిన రాజు దొర అలియాస్‌ బాయ్‌ వద్ద 4.596 కేజీల గంజాయిని రూ.10 వేలకు కొనుగోలు చేసి చెన్నై వెళ్లేందుకు బయలుదేరాడు. విశాఖపట్నం, చెన్నై రైలు ఎక్కేం దుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గంజాయి బ్యాగుతో పర్లాకిమిడి నుంచి పాతపట్నం నడుచుకుంటూ వస్తుండగా ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. ధనుష్‌ ఏకాంబరం బీఏ చదువుకునే రోజు ల్లోనే గంజాయికి అలవాటు పడ్డాడు. వైజాగ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద బల్లిగూడ ప్రాంతానికి చెందిన రాజుదొర తో పరిచయం ఏర్పడింది. అతని వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి చెన్నైలో అధిక ధరకు అమ్మకం జరపాలనే ఉద్దేశంతో తరలిస్తున్నాడు. గంజా యి రవాణా కేసులో గతంలో తిరువళ్లూరు పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడని సీఐ తెలిపారు. కాగా గంజా యి రవాణాను అడ్డు కోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ రామా రావు, ఎస్‌ఐ లావణ్య, ఏఎస్‌ఐ కె.కృష్ణారావు, కానిస్టేబుళ్లు బి.గోపాలరావు, జి.మన్మథరావులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ మేరకు సదరు వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ఆమదాలవలసలో కేసు నమోదు

ఆమదాలవలస, మార్చి 8(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ లో ఉన్న ఒక కిల్లీ బడ్డీలో గంజాయి విక్రయిస్తున్న పొట్నూరు కృష్ణారావుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గత సోమవారం దుకాణం వద్దకు శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు మఫ్టీలో వచ్చి గంజాయి కొనుగోలు చేశారు. అనంత రం ఆ దుకాణాన్ని తనిఖీ చేసి నిందితుడిని ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీనిపై విచారణ చేపట్టి పట్టణంలోని డాబాల వారి వీధికి చెందిన కృష్ణారావుపై కేసు నమోదు చేశారు. అతడి వద్ద నుంచి 70 గ్రాము ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆమదాల వలస జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

మాట్లాడుతున్న సీఐ రామారావు, ఎస్‌ఐ లావణ్య (రామారావు)

Updated Date - Mar 08 , 2025 | 11:53 PM