8 కేజీల గంజాయితో 11 మంది అరెస్టు
ABN, Publish Date - Feb 22 , 2025 | 11:43 PM
ఒడిశా నుంచి గుణుపూర్-నౌపడా రైలు ద్వారా గంజా యిని టెక్కలికి తరలిస్తున్న 11 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.
టెక్కలి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి గుణుపూర్-నౌపడా రైలు ద్వారా గంజా యిని టెక్కలికి తరలిస్తున్న 11 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి విలేకరులతో మాట్లా డుతూ వివరా లు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం రాయఘడ నుంచి గుణుపూర్-నౌపడా రైలు ద్వారా గంజాయిని తీసుకువచ్చి టెక్కలి ప్రాంతంలో యువకులకు విక్రయిస్తుండగా మేఘవరం పంచాయతీ బొరిగి పేట తోటల్లో పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 8 కేజీల గంజాయి, నాలుగు మోటార్ సైకిళ్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకు న్నట్లు సీఐ తెలిపారు. రాయఘడ ప్రాంతం చింతలవానిపేటకు చెందిన కొద్రక బిజయ్ వీరికి గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడడంతో ఈ వ్యవ హారం బయటకు పొక్కింది. టెక్కలి శివాలయం వీధికి చెందిన గెడ్డాం దేవేంద్రనాథ్, ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేవాది మోహన్, బయ్యా మధు, సంతబొమ్మాళి మండలం కాశీపురానికి చెందిన రాజాపు తరుణ్ కుమార్, ఇజ్జువరానికి చెందిన యండావ దేవనకుమార్, టెక్కలి గాసివీధికి చెందిన నాగవంశపు వంశి, కోదండరామ వీధికి చెందిన బుడుమూరు సాయితేజ, అయ్యప్పనగర్‌కు చెందిన చింతాడ చందు, వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలికి చెందిన బాడాన అవినాష్, విశాఖపట్నం కొమ్మాది ప్రాంతానికి చెందిన గిన్ని సాయివెంకట నాగవరప్రసాద్ రెడ్డిలను అరెస్టుచేసినట్లు తెలి పారు. ఈ మేరకు కేసు నమోదుచేసి నిందితులను కోర్టుకు తరలింమన్నారు. సమావేశంలో ఎస్‌ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Feb 22 , 2025 | 11:43 PM