ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి

ABN, Publish Date - Jan 17 , 2025 | 11:31 PM

పీలేరులో శ్రీకృష్ణదేవరాయల జయంతిని బలిజ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

పీలేరులో ర్యాలీ నిర్వహిస్తున్న బలిజ సంఘం సభ్యులు

పీలేరు, జనవరి 17(ఆంధ్రజ్యో తి): పీలేరులో శ్రీకృష్ణదేవరాయల జయంతిని బలిజ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలి లో పేదలకు అన్నదానం చేశా రు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తన పరిపాలనా విధానాలతో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శిని కుడు శ్రీకృష్ణదేవరాయులు అని కొనియాడారు. ఆయన పాలన గతించి వందల ఏళ్లు గడుస్తున్నా ఆయన సాధించిన అభివృద్ధి, పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానా లు నేటికీ కొనసాగుతుండడం విశేషమన్నారు. పీలేరు పట్టణంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు. ఇదే విషయంపై తహసీల్దారు భీమేశ్వర రావుకు వినతి పత్రం అందించారు. పీలేరు ప్రాంతంలోని పెరిక, గాజుల బలిజ కులస్థులకు కులధృవీకరణ పత్రాలు మంజూరు అంశంలో న్యాయం చేయాలని తహసీల్దారుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో బలిజ సంఘం నాయకులు పోతంశెట్టి రమేశ, లక్ష్మీకర, డాక్టర్‌ మల్లిఖార్జున, పచ్చార్ల వెంకటరమణ, పురుషోత్తం, సుబ్రహ్మణ్యం, మనోహర్‌, వెంక ట రమణ, నాగేంద్ర ప్రసాద్‌, కళావతి, పీవీఎస్‌ లక్ష్మి, సుభాషిణి, భాగ్య, వనిత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:31 PM