సమస్యలు పరిష్కరించండి
ABN, Publish Date - Jan 16 , 2025 | 11:21 PM
తమ సమస్యలు పరిష్క రించాలని జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లెపల్లి ఉత్తప్ప, పలువురు వడ్డెర నాయకులు కలెక్టర్ టీఎస్ చేతనను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
పుట్టపర్తిటౌన, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్క రించాలని జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లెపల్లి ఉత్తప్ప, పలువురు వడ్డెర నాయకులు కలెక్టర్ టీఎస్ చేతనను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. కొండ క్వారీల్లో తమకు 35 శాతం రాయితీ ఇవ్వాలని, ప్రతి మండల కేంద్రంలో వడ్డె ఓబన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని, క్వారీల్లో ప్రమాదాల వల్ల గాయపడిన, చనిపోయిన వడ్డెర్లకు రూ.పదిలక్షల ప్రమాదబీమా మంజూరు చేయాలని కోరారు. 50 యేళ్లు నిండిన వడ్డెర్లకు పింఛన మంజూరు చేయాలని, ప్రభుత్వ పనుల్లో 15నుంచి 20శాతం తమకు కేటాయించాలని కోరారు. వారి వెంట వడ్డెర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బోగుల చక్రపాణి, జాతీయ ఉపాధ్యక్షుడు పల్లపు జయచంద్ర, దండగల మారెప్ప, ఎర్రవంకపల్లి గంగులప్ప, గంగరాజు ఉన్నారు.
Updated Date - Jan 16 , 2025 | 11:21 PM