సోలార్ వెలుగులు!
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:40 AM
పల్లె, పట్టణం తేడా లేకుండా సోలార్ వైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ చార్జీల మోత తట్టుకోలేకపోతున్న వారంతా ఈ వైపు తొంగి చూస్తున్నారు. ప్రత్యేకించి పెరిగిన నైపుణ్యత, అందుబాటులో సోలార్ పలకలు కలబోసి ఆ వైపే లక్ష్యాలు.
ద్వారకా తిరుమలలో సోలార్ పార్కుకు ప్రతిపాదన
ఇంకోవైపు 471 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్‌కు సన్నద్ధత
ఈ దిశగా యంత్రాంగం అడుగులు
సూర్యఘర్ కింద ఇప్పటికే 537 గృహాలకు సౌర విద్యుత్
జిల్లాలో మరింత విస్తరణకు చర్యలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
పల్లె, పట్టణం తేడా లేకుండా సోలార్ వైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ చార్జీల మోత తట్టుకోలేకపోతున్న వారంతా ఈ వైపు తొంగి చూస్తున్నారు. ప్రత్యేకించి పెరిగిన నైపుణ్యత, అందుబాటులో సోలార్ పలకలు కలబోసి ఆ వైపే లక్ష్యాలు. జిల్లాలో ఇప్పటి వరకు 537 మందికి పైగా తమ ఇంటి పైభాగాన సౌర పలకల ఏర్పాటుకు అంగీకరిం చారు. దీనికి తోడు ద్వారకాతిరుమలలో పైలెట్ ప్రాజెక్టుతో పాటు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు వైపు ప్రతిపాదనలు కదిలాయి.
ప్రతీనెలా కుటుంబ బడ్జెట్‌లో విద్యుత్ బిల్లు సమాం తరమైంది. బిల్లు తగ్గించుకుందామనుకున్నా సామా న్యు ల నుంచి మధ్య తరగతి వరకు పెరిగిన చార్జీలు, సర్ చార్జీలు, సర్దుబాటు పేరిత ఎప్పటికప్పుడు బిల్లు తడిసె మోపెడవుతూనే వస్తోంది. సరాసరిన రెండు గదుల నివాసంలో బిల్లు రూ.330 నుంచి రూ.410 వరకు వస్తుంది. వేసవి వచ్చిందంటే ఇది కాస్తా ఐదు నెలల పాటు రెట్టింపవుతుంది. మిగతావన్నీ తగ్గించుకుని విద్యుత్ బిల్లు కట్టడానికే పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించా లని అటు రాష్ట్రం, ఇటు కేంద్రం భావిస్తున్నాయి. కేంద్రం ఇప్పటికే సూర్యఘర్ పేరిట సరికొత్త పథకాన్ని ప్రజల ముందుంచింది. దీనికి తోడు వాణిజ్య బ్యాంకులకు సోలార్ వాడే లబ్ధ్దిదారు లకు తగినంత రుణ సౌకర్యం కల్పిం చాల్సిందిగా మార్గనిర్దేశం చేసింది. ద్వారకాతిరుమలలో పైలట్ ప్రాజెక్టు గా సోలార్ పార్కును ఏర్పాటు చేయ బోతున్నారు. దాదాపు 750 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన పార్కును దశల వారీగా తీర్చిదిద్దడమే కాకుండా సమీ పాన ఉన్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అవగాహన కలిగించి వారి ఇళ్ల పై కప్పులపై సోలార్ ఫలకాలు అమర్చి సౌర విద్యుత్‌ను వినియోగించేలా చూడాలని అధికారులు భావిస్తున్నా రు. భూమి అందుబాటులో ఉండడం, మధ్యతరహా కుటుంబాలు ద్వారకా తిరుమల చుట్టూ ఉండడంతో ఆ మేరకు పైలట్ ప్రాజెక్టును సంసిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఒకవైపు ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు ఈ పైలట్ ప్రాజెక్టు సంసిద్ధం చేసే దిశగా తుది ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్ట్ సోలార్‌కు కొత్త సొబగులు అద్దే అవకాశం ఉంది.
వ్యవసాయ అవసరాలకు..
ఇప్పటివరకు కేవలం గృహ అవసరాల నిమిత్తమే ద్వారకా తిరుమలలో సోలార్ పార్కుకు ప్రతిపాదించా రు. కాని దీంతోపాటే వ్యవసాయ అవసరాలకు సైతం సోలార్ పవర్‌ను ఎందుకు వినియోగించుకోరాదనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దానికి కూడా సై అన్నారు. జిల్లా యంత్రాంగం ఒకవైపు పైలట్ ప్రాజెక్టును సమీక్షిస్తూనే సమాంతరంగా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం దిశగానే అడుగులు వేసింది. గృహ అవసరాలకు 750 కిలోవాట్ల సామర్థ్యంతోనే ఓ పార్కును ఏర్పాటు చేస్తుండగా, వ్యవ సాయ అవసరాలకు దాదాపు 105 మెగావాట్ల సామ ర్థ్యంతో ప్లాంట్ నెలకొల్పాలని భావిస్తున్నారు. దీనికి అవ సరమైన సుమారు 471 ఎకరాలను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలైంది. మెట్టలో వ్యవసాయ విద్యుత్ విని యోగం ఇప్పటికే గణనీయంగా ఉంది. ఉమ్మడి పశ్చిమ లోనే ఏటా దాదాపు రూ.160 కోట్లు విద్యుత్ సబ్సిడీగా ప్రభుత్వం భరిస్తోంది. అదే సోలార్ విద్యుత్ అందు బాటులోకి వస్తే దీనిని విద్యుత్ పంపు సెట్ల వినియోగా నికి చౌకగా లభిస్తుందని భావిస్తున్నారు. గృహ అవస రాల నిమిత్తం సోలార్ వినియోగంలో చైతన్యపరుస్తు న్నట్టే వ్యవసాయ విద్యుత్ వినియోగంలోను అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
గృహ వినియోగదారుల్లో చైతన్యం
సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవడం ద్వారా నెలవారీ బిల్లులను ఎలా మదింపు చేసుకోవచ్చో విని యోగదారుల్లో కొంత చైతన్యం క్రమేపీ విస్తరిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకునేలా ఇప్పటికే ఆకర్షణ విధా నాలను అవలంభిస్తున్నారు. సూర్యఘర్ కింద ఎవరైతే సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోదలచుకున్నారో వారందరికీ బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నా యి. గత మూడు నెలల్లో 537 గృహ వినియోగదారులు ఈ దిశగా ముందుకు కదిలారు. వారి గృహాల పైభాగంలో సౌర ఫలకలను అమర్చడం ద్వారా మిగతా వారు ఆ దిశగా కదిలేలా సన్నద్ధత చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో సోలార్ రానున్న రోజుల్లో వినియోగం మరింత స్థాయికి చేరే అవకాశం లేకపోలేదు.
Updated Date - Jan 28 , 2025 | 12:40 AM