రిజిస్ట్రేషన్.. కిటకిట!
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:55 AM
జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ శుక్రవారం కిటకిటలాడాయి. ఉదయం నుంచి పొద్దుపోయేంత వరకు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారంతా గంటల తరబడి వేచి ఉండడమే కాక ఇబ్బందులు పడ్డారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతుండడంతో అంతకంటే ఒక రోజు ముందుగానే రిజిస్ట్రేషన్‌కు ఎగబడ్డారు.
చార్జీల పెరుగుదలతో ముందు రోజే అత్యధికుల ఉత్సాహం
రోజంతా మొరాయించిన సర్వర్..జనం ఎదురుచూపులు
నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ శుక్రవారం కిటకిటలాడాయి. ఉదయం నుంచి పొద్దుపోయేంత వరకు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారంతా గంటల తరబడి వేచి ఉండడమే కాక ఇబ్బందులు పడ్డారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతుండడంతో అంతకంటే ఒక రోజు ముందుగానే రిజిస్ట్రేషన్‌కు ఎగబడ్డారు. జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అవన్నీ రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారితో కిటకిటలా డాయి. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం 40 రిజిస్ట్రేషన్లు జరగ్గా గురువారం నాటికి ఈ సంఖ్య 104కు పైగానే నమోదైంది. శుక్రవారం రిజిస్ట్రేషన్లకు ప్రజలు తరలిరాగా సాయంత్రం పొద్దుపోయే నాటికి 60 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయగలిగారు. ఏలూరు, వట్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో 20 నుంచి 25 శాతం మేర ఒక్కసారిగా పెరగడంతో దీని ప్రభావం కాస్తా రిజి స్ట్రేషన్ చార్జీలపై పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తే పెరిగిన భారం మీద పడకుండా తప్పించుకోగలమన్న భావనలోనే అందరూ కనిపించారు. చింతలపూడి, నూజివీడుల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలూ రిజిస్ట్రేషన్లకు వచ్చిన వారితో కిక్కిరిశాయి. ఇంతకుముందు రోజుకు 20 నుంచి 30లోపే రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 80 నుంచి 120కు వరకు పెరిగింది. నూజివీడు పరి సరాల్లో ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున భూలావాదేవీలు ఒక కొలిక్కి వచ్చా యి. రిజిస్ట్రేషన్ చార్జీల సవరణ జరగకముందే తమ భూముల రిజిస్ట్రేషన్‌కు ఆరాటపడి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తరలివచ్చారు. కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం అనేకమంది పడిగాపులు పడ్డారు. కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, గణపవరం, మండవల్లి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య శుక్రవారం భారీగా పుంజుకున్నాయి. రిజిస్ట్రేషన్ల చార్జీల సవరణ అనూహ్యంగా 10 నుంచి 15 శాతంలోపే ఉంటుందని అందరూ భావించినా దీనికి విరుద్దంగా మండవల్లి, నూజివీడు, కైకలూరు, పోలవరం, కామవరపుకోటలో 10 నుంచి 25 శాతం మేర చార్జీల సవరణ జరగడంతో అందరూ ఉలిక్కిపడి అందుబాటులో ఉన్న మేరకు రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ రద్దీగా మారిన తరుణంలోనే రిజిస్ట్రేషన్ సర్వర్ ఒక్కసారిగా మందగించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం పొద్దుపోయేంత వరకు సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్లకు వచ్చిన వారంతా ఆపసోపాలు పడాల్సి వచ్చింది. మరోవైపు సర్వర్ మందగించడంతో కార్యాలయాల సిబ్బంది తంటాలు పడ్డారు.
Updated Date - Feb 01 , 2025 | 12:56 AM