ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ పాపం.. విద్యార్థులకు శాపం!

ABN, Publish Date - Mar 07 , 2025 | 01:39 AM

గత వైసీపీ శాపం కారణంగా పాఠశాల విద్యార్థులు దాహం కేకలు వేస్తున్నారు. విద్యార్థులకు సురక్షిత తాగునీటిని అందించేందుకు గత వైసీపీ ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌లు మూలనపడ్డాయి. దీంతో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. వేసవికాలం రాబోతుండడంతో విద్యాశాల ఉన్నతాధికారులు ఆదేశాలలో పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న వాటర్‌ ప్లాంట్ల మరమ్మతులకు ప్రాధానోపాధ్యాయులు చర్యలకు పూనుకున్నారు.

తిమ్మాయపాలెం జడ్పీహెచ్‌ఎ్‌సలో పని చేయని వాటర్‌ ప్లాంట్‌

నాడు-నేడులో ఏర్పాటు చేసిన

వాటర్‌ప్లాంట్‌లు మూలకు

మరమ్మతులకు ముందుకు రాని కాంట్రాక్టర్‌

తాగునీటి కల్పనకు విద్యాశాఖ అధికారుల ప్రత్యామ్నాయ చర్యలు

అద్దంకిటౌన్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ శాపం కారణంగా పాఠశాల విద్యార్థులు దాహం కేకలు వేస్తున్నారు. విద్యార్థులకు సురక్షిత తాగునీటిని అందించేందుకు గత వైసీపీ ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌లు మూలనపడ్డాయి. దీంతో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. వేసవికాలం రాబోతుండడంతో విద్యాశాల ఉన్నతాధికారులు ఆదేశాలలో పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న వాటర్‌ ప్లాంట్ల మరమ్మతులకు ప్రాధానోపాధ్యాయులు చర్యలకు పూనుకున్నారు.

మండలంలో 31 వాటర్‌ ప్లాంట్‌లు మంజూరు

గత వైసీపీ హయాంలో పాఠశాలలో నాడు-నేడు కింద 31 వాటర్‌ ప్లాంట్‌లను మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్యను ఆధారంగా రూ.75వేలు, రూ.1.50లక్షలు, రూ.2.50లక్షల విలువైన మూడు రకాల వాటర్‌ప్లాంట్‌లను పేజ్‌-1లో మంజూరు చే సింది. అయితే ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ రెండు మూడు నెలలు కూడా పని చేయకుండా మూలన పడ్డాయి. మరమ్మతులకు సంబంధిత కాంట్రా క్టర్‌లకు ఎన్ని సార్లు చెప్పినా వచ్చి చూడడం తప్ప వాటిని మరమ్మతులు చేయలేదు. దీంతో అవి ఏళ్ల తరబడి నిరుపయోగంగా పడిఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం పాఠశాలలు చెందిన ఫండ్స్‌ను ఇవ్వకపోవడంతో వాటర్‌ప్లాంట్‌ల మరమ్మతులను హెచ్‌ ఎంలు చేయించలేదు. దీంతో అవి ఆలంకారప్రాయంగానే మిగిలిపోయ్యాయి.

తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

నాటి ప్రభుత్వం ఇచ్చిన వాటర్‌ ప్లాంట్‌లు నిరుపయోగంగా మారడంతో పలు పాఠశాలలో విద్యా ర్థులకు తాగునీటిని అందించేందుకు గ్రామంలోని వాటర్‌ ప్లాంట్‌ల వద్ద నుంచి వాటర్‌ క్యాన్‌లతో నీటిని కొనుగోలు చేసి దాహం తీరుస్తున్నారు. మరి కొన్ని పాఠశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ల ద్వారా విద్యార్థుల దాహర్తిని తీరుస్తున్నాయి.

విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో మరమ్మతులకు చర్యలు

వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలో మూలనపడిన నాడు-నేడు వాటర్‌ప్లాంట్‌ల పరిస్థితిని పరిశీలించి వెంటనే తగు మరమ్మతులకు ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులు చర్యలు చేపట్టారు. వాటర్‌ప్లాంట్‌ల పరిస్థితి ఏమిటి ఎంత ఖర్చు అవుతుంది, వాటికి సంబంధించిన వస్తువుల కోనుగోలు వంటివి ఏర్పాటు చేసి ప్లాంట్‌లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పాఠశాలలకు సంబంధించిన ఫండ్స్‌ను విదుదల చేయడం, వాటిని తోడు కొంత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఖర్చు చేసి ప్లాంట్‌లను వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండు పాఠశాలల్లో ఉన్న వాటర్‌ప్లాంట్‌లను మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చారు. లక్షలు ఖర్చు చేసి నిరుపయోగంగా పెట్టిన వాటర్‌ప్లాంట్‌లను మరమ్మతులు చేయించి విద్యార్థులు తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్న చర్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 01:39 AM