ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సమస్యలపై చర్చ జరిగేనా?

ABN, Publish Date - Feb 09 , 2025 | 01:15 AM

జిల్లాలో ప్రజానీకం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా తాగునీటి ఎద్దడి ముంచుకొస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఆ సమస్య మరింత తీవ్రంకానుంది. మరోవైపు పంట దిగుబడులతోపాటు ధరలు దిగజారి రైతులు అల్లాడుతున్నారు.

పంట దిగుబడులు, ధరలు దిగజారి అల్లాడుతున్న రైతులు

ముంచుకొస్తున్న తాగునీటి ఎద్దడి

నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

అంచనా బడ్జెట్‌ ఆమోదం

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రజానీకం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా తాగునీటి ఎద్దడి ముంచుకొస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఆ సమస్య మరింత తీవ్రంకానుంది. మరోవైపు పంట దిగుబడులతోపాటు ధరలు దిగజారి రైతులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. అనేక రకాల సమస్యలను ఆ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించి వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులను కోరతారు. ఆ అంశాలపై జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సమావేశం పూర్తిస్థాయిలో జరుగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా జిల్లా పరిషత్‌ సమావేశం ఉదయం 10.30 గంటలకు మొదలై సాయంత్రం వరకు కొనసాగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఈసారి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుండటంతో పూర్తిస్థాయిలో ఆయా అంశాలపై చర్చ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం 13 అంశాలను అజెండాలో ఉంచారు. విద్య, వైద్యశాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ, పౌరసరఫరాలు, విద్యుత్‌, సాంఘిక సంక్షేమం, డీఆర్‌డీఏ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల తీర్మానాల ఆమోదం, 2025-26 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్‌ ఆమోదం వంటి వాటిని మాత్రమే చేర్చారు.

Updated Date - Feb 09 , 2025 | 01:15 AM