ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శభాష్‌ పోలీస్‌!

ABN, Publish Date - Mar 11 , 2025 | 01:34 AM

ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. ఈ ఘటన సోమవారం జగ్గంబొట్ల రైల్వే లైన్‌పై చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... కంభంకు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు.

కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్సై కోటేశ్వరరావు

ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన రాచర్ల ఎస్‌ఐ

బేస్తవారపేట, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. ఈ ఘటన సోమవారం జగ్గంబొట్ల రైల్వే లైన్‌పై చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... కంభంకు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో భయాందోళనకు గురైన వారు కంభం పోలీసులను ఆశ్రయించారు. అతని సెల్‌ సిగ్నల్‌ రాచర్ల మండలం చూపడంతో వెంటనే ఆ మండల ఎస్సైకి సమాచారం ఇచ్చారు. స్పందించిన రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు రైల్వేలైన్‌పై పరిశీలన చేపట్టగా బేస్తవారపేట మండలంలోని జగ్గంబొట్ల కృష్ణాపురం ట్రాక్‌ వద్ద ఆ వ్యక్తి కనిపించాడు. ఆయన్ను పట్టుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన ఎస్సైని ప్రజలు అభినందించారు.

Updated Date - Mar 11 , 2025 | 01:34 AM