ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దొనకొండలో దాహం.. దాహం

ABN, Publish Date - Mar 03 , 2025 | 11:26 PM

దొనకొండ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ప్రధానంగా ఒబ్బాపురం పరిధిలోని ప్రజలు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. దాదాపు 15 రోజులుగా సాగర్‌ జలాలు సరఫరా కాకపోవటంతో గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొనకొండ ప్రజల దాహార్తి నిమిత్తం నిర్మించిన చందవరం-1 స్టోరేజీలో సంమృద్ధిగా సాగర్‌ జలాలు ఉన్నాయి. అయినా 15 రోజులుగా నీటి సరఫరా జరగటం లేదని ఒబ్బాపురం ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొనకొండలోని మిగిలిన ప్రాంతాల్లో నాలుగు రొజులకొకసారి సాగర్‌ జలాలు సరఫరా జరుగుతున్నా ఒబ్బాపురం ప్రాంతానికి 15 రోజులకు కూడా రావడంలేదు.

ఒబ్బాపురంలో అధ్వానంగా తయారైన నీటిసంపు

ఒబ్బాపురంకు 15 రోజులుగా

సరఫరాకాని సాగర్‌ జలాలు

స్టోరేజీలో సంమృద్ధిగా ఉన్నా

తప్పని సమస్య

నీటి సంపు పరిశుభ్రతను

పట్టించుకోని సిబ్బంది

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

దొనకొండ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): దొనకొండ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ప్రధానంగా ఒబ్బాపురం పరిధిలోని ప్రజలు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. దాదాపు 15 రోజులుగా సాగర్‌ జలాలు సరఫరా కాకపోవటంతో గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొనకొండ ప్రజల దాహార్తి నిమిత్తం నిర్మించిన చందవరం-1 స్టోరేజీలో సంమృద్ధిగా సాగర్‌ జలాలు ఉన్నాయి. అయినా 15 రోజులుగా నీటి సరఫరా జరగటం లేదని ఒబ్బాపురం ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొనకొండలోని మిగిలిన ప్రాంతాల్లో నాలుగు రొజులకొకసారి సాగర్‌ జలాలు సరఫరా జరుగుతున్నా ఒబ్బాపురం ప్రాంతానికి 15 రోజులకు కూడా రావడంలేదు. నీటి సరఫరా గురించి సిబ్బందిని ప్రశ్నిస్తే పైపులైన్‌ పగిలిందని, సంప్‌కు నీరు చేరటం లేదనే సమాధానం చెబుతున్నారని ఆప్రాంతవాసులు పేర్కొన్నారు. పైప్‌లైన్‌ పగిలితే మరమ్మతులు వెంటనే చేయించి నీటి సరఫరా చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే తమకు నీటి కష్టాలు ఎదురైతే రానున్న మూడు నెలల వేసవిలో నీటి కష్టాలను తలచుకుంటే భయమేస్తుందని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఒబ్బాపురంలో నిర్మించిన నీటి సంపు పురాతనమై నిర్వహణకు నోచుకోక అపరిశుభ్రంగా మారింది. దీంతో నీటి సరఫరా జరిగిన సమయంలో తమకు స్వచ్ఛమైన సాగర్‌ నీరు అందటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సంపునకు మూతలేకపోవటంతో వీధికుక్కలు సంపుపైకి ఎక్కి తిరుగుతూ తరచూ సంపులో కుక్కలు పడి అరుస్తుండటంతో స్థానికులు వ్యయప్రయాసలకు గురై వాటిని బయటకు తీసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఒబ్బాపురం ప్రజలు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి, అధ్వానంగా తయారైన నీటి సంపునకు నిర్వాహణ చేపట్టి స్వచ్ఛమైన సాగర్‌ జలాలు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 03 , 2025 | 11:26 PM