ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం

ABN, Publish Date - Feb 17 , 2025 | 12:59 AM

కంభం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఐతా కృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మువ్వల శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.

కంభం, ఫిబ్రవరి16, (ఆంధ్రజ్యోతి): కంభం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఐతా కృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మువ్వల శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునితోపాటు కార్యదర్శిగా సోమిశెట్టి రాజా, కోశాధికారిగా కటకం ప్రదీప్‌లు ఎన్నికయ్యారు. కార్యక్రమం లో విఠా వెంకటశ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకులు బొంతల సుదీర్‌, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాదెళ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

బేస్తవారపేట : బేస్తవారపేట మండల ఆర్య వైశ్య కమిటీ అధ్యక్షులుగా జక్కా సుబ్రహ్యణ్యం ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఆదివారం బేస్తవారపేటలో జరిగిన సమావేశంలో కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా జక్కా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సంఘం కార్యదర్శిగా వాగిచర్ల మారుతిప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా దోగిపర్తి కొండలు, కోశాధికారిగా శ్రీరాంప్రసాద్‌, సహాయ కార్యదర్శిగా ముప్పూరి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.

Updated Date - Feb 17 , 2025 | 12:59 AM