రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం
ABN, Publish Date - Jan 21 , 2025 | 10:43 PM
రీసర్వేతో భూసమస్యలు పరిష్కారమవుతాయని కనిగిరి ఆ ర్డీవో కేశవర్ధన్ రెడ్డి అన్నారు. కురి చేడు మండలం పేరుంబొట్లపాలెం లో మంగళవారం రీసర్వేపై జరిగి న గ్రామ సభకు తహసీల్దార్ రజ నీకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి భూ సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవాలని సూచించారు. మ్యుటేషన్ కూడా చేయించుకోవాలని చెప్పారు.
ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి
కురిచేడు, జనవరి 21(ఆంధ్ర జ్యోతి): రీసర్వేతో భూసమస్యలు పరిష్కారమవుతాయని కనిగిరి ఆ ర్డీవో కేశవర్ధన్ రెడ్డి అన్నారు. కురి చేడు మండలం పేరుంబొట్లపాలెం లో మంగళవారం రీసర్వేపై జరిగి న గ్రామ సభకు తహసీల్దార్ రజ నీకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి భూ సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవాలని సూచించారు. మ్యుటేషన్ కూడా చేయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నాగరాజు, వీఆర్వో సరోజని, సర్వేయర్ గోపి, తదితరులు పాల్గొన్నారు.
లోపాలు సరిదిద్దేందుకే రీసర్వే
దర్శి : రాష్ట్ర ప్రభుత్వం గతంలో నెలకొన్న లోపాలను సరిదిద్దేందుకే రీసర్వే చేపట్టినట్టు ఆర్డీవో కేశవర్ధనరెడ్డి తెలిపారు. మండలం లోని బుక్కాపురం రెవెన్యూ గ్రామాన్ని రెండో దశలో రీసర్వేకు ఎంపిక చేశారు. అందులోభాగంగా మంగళ వారం నిర్వహించిన రీసర్వే గ్రామసభలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల్లో ఏమైనా లోపాలుంటే సంబంధిత వ్యక్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ బు క్కాపురం గ్రామంలో 488 మంది రైతులకు 1636.96 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. రీసర్వే ద్వారా హద్దుల లోపాలు సరిచేయటం, రికార్డులు క్రమబద్ధీ కరణ చేయడం జరగుతుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 10:43 PM