ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తమ్మవరం రోడ్డుకు మోక్షం

ABN, Publish Date - Mar 03 , 2025 | 11:28 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి అధ్వానంగా మారిన రోడ్లకు మహర్దశ పట్టింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రయాణానికి కూడా వీలులేకుండా గుంతలతో ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి ప్రయాణానికి అనుకూలంగా చేశారు. ప్రభుత్వం కొద్దిగా కుదురుకున్నాకా గ్రామీణ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు.

గుంతలతో అధ్వానంగా ఉన్న తమ్మవరం రోడ్డు

రూ.1.44 కోట్లతో నిర్మాణానికి అనుమతులు

మేదరమెట్ల, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి అధ్వానంగా మారిన రోడ్లకు మహర్దశ పట్టింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రయాణానికి కూడా వీలులేకుండా గుంతలతో ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి ప్రయాణానికి అనుకూలంగా చేశారు. ప్రభుత్వం కొద్దిగా కుదురుకున్నాకా గ్రామీణ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు.

విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చొరవతో తమ్మవరం రోడ్డుకు రూ.1.44కోట్ల నిధులు మంజూరు చేయించారు. మేదరమెట్ల నుంచి తమ్మవరం వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డులో ప్రయాణించడానికి వాహనదారులు ఇబ్బం ది పడుతున్నారు. తమ్మవరంలో గుండ్లకమ్మ నది వడ్డున 20వేల ఎకరాలకు సాగు నీరు అందించే కొరిశపాడు ఎత్తిపోతల పథకం, 4,500 వేల ఎకరాలకు నీరు అందించి తమ్మవరం-2 ఎత్తిపోతల పథకంతో పాటు తమ్మవరం గ్రామంలో 500ఎకరాలకు సాగు నీరు అందించే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. కొత్తగా నిర్మిస్తున్న ఈథనాల్‌ ఫ్యాక్టరీ, విండ్‌ పవర్‌ తయారీకి అవసరమైన విడి భాగాలను తయారు చేసే పరిశ్రమ ఉంది. వీటి అన్నింటికీ తోడు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పీడీఎస్‌ బియ్యం నిల్వచేసే గోడౌన్‌లు ఇక్కడే ఉన్నాయి. కంకర, గ్రావెల్‌ ఈ ప్రాంతం నుంచే చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా అవుతుంది. ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేయించడం పట్ల మంత్రి రవికుమార్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లగా ఈ రోడ్డుపై ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నామని ఈ నిధులు మంజూరుతో తమ కష్టాలు తీరనున్నాయని తమ్మవరం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 03 , 2025 | 11:28 PM