ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం

ABN, Publish Date - Mar 08 , 2025 | 11:35 PM

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందజేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత అన్నారు. పట్టణ సమీపంలోని మాచవరం వద్ద ఉన్న బీసీ గురుకుల బాలికల వసతి గృహాన్ని శనివారం రాత్రి ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్‌కు సూచించారు.

హాస్టల్‌లో భోజనాన్ని రుచి చూస్తున్న బీసీ సంక్షేమ శాఖామంత్రి ఎస్‌ సవిత

బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత ఆదేశం

వసతి గృహం ఆకస్మిక తనిఖీ

వార్డెన్‌పై అసహనం

కనిగిరి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందజేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత అన్నారు. పట్టణ సమీపంలోని మాచవరం వద్ద ఉన్న బీసీ గురుకుల బాలికల వసతి గృహాన్ని శనివారం రాత్రి ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్‌కు సూచించారు. అనంతరం హాస్టల్‌ రికార్డులను తీసుకురావాల్సిందిగా వార్డెన్‌ను ఆదేశించగా, ఇంటి వద్ద ఉన్నాయనటంతో మంత్రి సవిత అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్‌ రికార్డులను ఇంటి వద్ద ఎలా పెడతావ్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం రుచిచూసి కూరలు సరిగా లేకపోవటంపై వార్డెన్‌ను ప్రశ్నించారు. మీ ఇంట్లో ఇలాగే వండుకుని తింటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు చెందిన వారి పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టిక విలువలు కల్గిన ఆహారాన్ని అందించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని నీరుగార్చవద్దని హెచ్చరించారు.

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. అమరావతి ప్రాంగణంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎస్‌. సవిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా మహిళలను ఉద్దేశించి మంత్రి రామనారాయణరెడ్డి మాట్లాడుతూ కనిగిరిలో మహిళాశక్తి పేరుతో జరుగుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మహిళా సాధికారత కోసం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పదేళ్ళ క్రితం తాను ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్‌ ఉగ్ర కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేశారు. ఆసమయంలో కనిగిరి అభివృద్ధి కోసం డాక్టర్‌ ఉగ్ర చూపించిన చొరవ, కృషి తనకెంతో గొప్పగా అనిపించిందన్నారు. తిరిగి మళ్ళీ తాను ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా, ఎమ్మెల్యేగా డాక్టర్‌ ఉగ్ర ఉండటం కాకతాళీయమే అయినప్పటికీ కనిగిరి అభివృద్ధి కోసం తన సహకారం సంపూర్ణంగా ఉంటుందని చెప్పారు. కనిగిరి ఒకప్పడు నెల్లూరు జిల్లాలో ఉందన్నారు. ఆరకంగా కనిగిరి ప్రాంతంతో తనకు ఎంతో అభిమానం ముడిపడి ఉందన్నారు.

మంత్రి సవిత మాట్లాడుతూ కనిగిరి అభివృద్ధి కోసం తన సహకారం ఉంటుందన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎన్నో వసతి గృహాలు నిర్మించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం రెండు మాత్రమే వసతి గృహాలు నిర్మించి ఖజానాలో నిధులు మింగేసి ఊడ్చేశారని మంత్రి ఆరోపించారు. హాస్టల్‌లో బిల్డింగ్‌ ఏర్పాటు కోసం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి నిధులు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తెలుగుమహిళల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మంత్రి సవితను పట్టువస్ర్తాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుమహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అంతకుముందు ఉదయం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర తన నివాసంలో మహిళలను ఘనంగా సన్మానించారు. కేకు కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఉజ్వల భవిష్యత్తు, అభివృద్ధికి తగిన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు సహాయాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు కరణం అరుణ, స్వప్న, దొరసాని, తులసి, పార్వతమ్మ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:35 PM