ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం పర్యటనను విజయవంతం చేద్దాం

ABN, Publish Date - Mar 06 , 2025 | 11:36 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంతర్జా తీయ మహిళా దినోత్సవం వేడుకలకు మార్కాపురం రానున్నారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు.

మార్కాపురం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంతర్జా తీయ మహిళా దినోత్సవం వేడుకలకు మార్కాపురం రానున్నారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు. స్థానిక తర్లుపాడు రోడ్డులోని సాయిబాలాజీ స్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రధానవేదికను ఆయన పరిశీలించారు. అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద కార్యకర్తల సమావేశం కోసం జరుగుతున్న వేదిక పనులను, కొండేపల్లి వెళ్లే దారిలోని హెలీప్యాడ్‌లను కూడా మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను యుద్ధప్రాతిపదికన శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ మార్కాపురం లాంటి వెనుకబడిన ప్రాంతంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అదృష్టంగా భావించాలన్నారు. మహిళాదినోత్సవ వేడుకల్లో విజన్‌- 2047లో భాగంగా మహిళల స్వావలంబన కోసం మెప్మా, డీఆర్‌డీఏలతో కొన్ని ఎంవోయూలు చేసుకుంటా రన్నారు. మహిళల కోసం ఉద్దేశించి రూపొందించిన శక్తియాప్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. అన్నిరంగాల్లోని మహిళలతో రెండు గంటలపాటు ముఖాముఖి ఉంటుందన్నారు. మహిళల సాధికారత, భద్రత, అభివృద్ధి తదితర అంశాలపై చర్చ సాగుతుందన్నారు. కార్యక్రమం అనంతరం పార్టీకి వెన్నుదన్నులాంటి కార్యకర్తలతో సమావేశం జరుగుతుం దన్నారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడి వారి కష్ట, సుఖాలు, పార్టీపరిస్థితి, పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుతారన్నారు. కార్యక్రమ అనంతరం జిల్లా అభివృద్ధిపై పలు కీలక విషయాలపై జిల్లా అధికా రులతో సమీక్ష ఉంటుందన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌ లో ఉన్న పనులు, జిల్లాకు అవసరమైన మేర జరగాల్సిన అభివృద్ధిపై అఽధికారులకు దిశానిర్ధేశం చేస్తారన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు, కలక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులు పాల్గొన్నారు.

శరవేగంగా ఏర్పాట్లు

ముఖ్యమంత్రి పర్యటనకు సంబందించి తొలుత ఎస్‌వీకేపీ కళాశాల, దరిమడుగు వద్ద స్థలాలను బుధవారం ఎంపిక చేశారు. కానీ కళాశాలలో పరీక్షలు ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు అక్కడ నిర్వహించ లేమని తేల్చారు. అంతేకాక కార్యక్రమం పొదిలికి మారిం దంటూ వదంతులు వ్యాపించడంతో గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వేకువజాము నుంచి తర్లుపాడు రోడ్డులోని పలు ప్రాంతాలను పరిశీలించారు. చివరికి 2023లో మూడు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బసచేసిన సాయిబాలాజీ స్కూల్‌ సమీపంలోని స్థలాన్నే ఎంపిక చేశారు. దీనికి జిల్లా అధికారులు కూడా అంగీకారం తెలిపారు. స్కూల్‌ ఎదురుగా ఉన్న 5 ఎకరాల పొలంలో మహిళా దినోత్సవ వేడుకల వేదికతోపాటు స్టాల్స్‌ ఏర్పాటు చేసేందుకు మార్కింగ్‌ ఇచ్చి పనులు ప్రారంభించారు. అదేవిధంగా కార్యకర్తలతో సమావేశానికి కూడా అక్కడికి సమీపంలో అల్లూరి పోలేరమ్మ దేవస్థానం ఎదురుగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు. హెలీప్యాడ్‌కు కూడా నూతన స్థలాన్ని ఎంపిక చేశారు. పోలేరమ్మ గుడిదాటిన తర్వాత కొండేపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోని స్థలాన్ని అనువైన దిగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి ఏర్పాట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్ననికే పూర్తి చేయాలని మంత్రి స్వామి ఆదేశించడంతో ఆ దిశగా జిల్లా అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా పూలసుబ్బయ్య కాలనీ చివరి నుంచి సభాస్థలి వరకు రహదారి 250 మీటర్ల మేర ఛిద్రమైంది. దాన్ని కూడా యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తున్నారు. పనులను అన్ని శాఖలకు చెందిన అధికారులకు జిల్లా కలెక్టర్‌ కేటాయించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. ప్రతి పోలీసు స్టేషన్‌ నుంచి అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాలకు శుక్రవారం మధ్యాహ్నానికి చేరుకోవాలని సూచించారు.

Updated Date - Mar 06 , 2025 | 11:36 PM