ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నివేశన స్థలాల కోసం భూములు కేటాయించాలి

ABN, Publish Date - Feb 16 , 2025 | 01:51 AM

నియోజకవర్గంలో ఇళ్లులేని నిరుపేదలకు నివే శన స్థలాలు మంజూరు చేసేందుకు భూము లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు.

మార్కాపురం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఇళ్లులేని నిరుపేదలకు నివే శన స్థలాలు మంజూరు చేసేందుకు భూము లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మార్కాపురం మున్సిపాలిటిలో సీసీరోడ్లు, డ్రైన్ల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపిందన్నారు. నిధులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కాపురం నియో జకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జేసీ గోపాలకృష్ణ హామీ ఇచ్చారు.

15వ వార్డులో పర్యటన

మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 15వ వార్డు పరిధిలోని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వార్డు పరిధిలో సీసీ రహదారులు, డ్రైన్‌లు నిర్మించాలన్నారు. పింఛన్లు మంజూరు చేయాలని ఎక్కువ మంది ఎమ్మెల్యేకు తెలి పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మౌలాలి, కొప్పుల శ్రీని వాసులు, కౌన్సిలర్‌ నాలి కొండయ్య తది తరులు పాల్గొన్నారు.

మార్కాపురం : ప్రభుత్వ,ం, ప్రజలు అందరూ కలిసి సమష్టిగా కృషి చేస్తేనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కల సాకారమవుతుందని ఎమ్మె ల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శని వారం ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా శనివారం పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక 15వ వార్డులో జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముందుగా మున్సిపాలిటీ ద్వారా ప్రతి ఇంటికి మూడు రకాల చెత్తలను వేసేందుకు డస్ట్‌బిన్‌లను పంపిణీ చేశారు. వార్డు పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలుచోట్ల మురికి కాలువల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి స్వయంగా కాలువల్లో చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బత్తుల చెన్నకేశవులు, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, కౌన్సిలర్‌ నాలి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 01:51 AM