వైభవంగా లక్ష్మీపూజ
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:19 AM
స్థానిక జవహర్‌నగర్ కాలనీ లోని ఆమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
మార్కాపురం వన్‌టౌన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక జవహర్‌నగర్ కాలనీ లోని ఆమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్ర వారం వేదపండితుల ఆధ్వర్యంలో సామూ హిక లక్ష్మీపూజ, కుంకుమార్చన నిర్వహిం చారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. శ్రీత్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి కార్యక్రమంలో పాల్గొని భక్తులను ఉద్దేశించి అనుగ్రహ బాషణం చేశారు. కమిటీ సభ్యులు డా. డీవీ కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, మల్లా రెడ్డి, ఎస్.యోగిరెడ్డి, వెంకట రెడ్డి, మహిళా కమిటీ, వికాస తరంగిణి సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించారు.
మార్కాపురం వన్‌టౌన్ : స్థానిక జవ హర్ నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత ఆమలక లక్ష్మీనారాయణ స్వామి నూతన కమిటీ శుక్రవారం నియ మించారు. నూతన కార్యవర్గ జాబితాను శ్రీ త్రిదండి అహోబిలం రామానుజజీయర్‌స్వామి మంగళ శాసనాల తో జాబితాను నియమించి కార్యవర్గానికి అందజేశారు. గౌరవ అధ్యక్షులుగా డా. డీవీ.కృష్ణారెడ్డి, అధ్యక్షురాలిగా గోళ్ల వరలక్ష్మీ, ప్రధాన కార్యదర్శిగా గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉపాధ్య క్షులుగా కందుల వేణుగోపాల్‌రెడ్డి, కోశాధి కారిగా చిట్యాల మల్లారెడ్డి, గౌరవ సలహా దారుగా ఏరువ సత్యనారాణరెడ్డి, సహాయ కార్యదర్శిగా యోగిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా డా.చెప్పల్లి కనకదుర్గ, బి.శ్రీనివాసరావు, ఎం.లక్ష్మీరెడ్డి, వెంకటేశ్వర్లు, నాగదివ్యలు ఎంపికయ్యారు.
Updated Date - Mar 08 , 2025 | 12:19 AM