విద్యార్థి దశ నుంచే కరాటే శిక్షణ అవసరం
ABN, Publish Date - Feb 16 , 2025 | 10:37 PM
విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ చిన్ని మురళీకృష్ణ అన్నారు. ఆర్‌బీ డ్రాగన్స్ షుటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అద్దంకి పట్టణంలోని గీతామందిరంలో జాతీయ స్థాయిలో ఓపెన్ కరాటే కుంగ్‌ఫూ టైక్వాండో చాంపియన్‌షి్‌ప పోటీలు జరిగాయి. పోటీలను చీఫ్ ఆర్గనైజర్ పి.రాంబాబు, ఆల్ ఇండియా అధ్యక్షుడు సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించారు.
అద్దంకి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ చిన్ని మురళీకృష్ణ అన్నారు. ఆర్‌బీ డ్రాగన్స్ షుటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అద్దంకి పట్టణంలోని గీతామందిరంలో జాతీయ స్థాయిలో ఓపెన్ కరాటే కుంగ్‌ఫూ టైక్వాండో చాంపియన్‌షి్‌ప పోటీలు జరిగాయి. పోటీలను చీఫ్ ఆర్గనైజర్ పి.రాంబాబు, ఆల్ ఇండియా అధ్యక్షుడు సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 6 రాష్ర్టాలు ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, యానాం రాష్ర్టాల నుంచి సుమారు 650 మంది పాల్గొన్నారు. ఓ వ రాల్ చాంపియన్స్‌గా నర్సారావుపేట టీం విజయం సాధించింది. వివిధ విభాగాల లో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు, సర్టిఫికెట్‌లను అందజేశారు. కార్యక్ర మంలో రోటరీ అధ్యక్షుడు వీరయ్య, చిన్ని శ్రీనివాసరావు, ఏసీటీవో సీతారామయ్య, అశోక్, పూర్ణచంద్రరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, శ్రీనివాసరావు, కరాటే మాస్టర్ వెంకటరత్నం పాల్గొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 10:37 PM