ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాటక రంగానికి ప్రాణం పోస్తున్న కళాపరిషత్‌లు

ABN, Publish Date - Jan 17 , 2025 | 11:53 PM

కళలు, కళాకారులకు, నాటక రంగాలకు కళాపరిషత్‌లు ప్రాణం పోస్తున్నాయని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఆరి ్థకంగా ఎంతకష్టమైనా కళాపరిషత్‌లను నిర్వహిస్తున్నవారిని ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో మూడోరోజు శుక్రవారం రాత్రి ప్రదర్శించిన ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ నాటిక పోటీలకు పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

కళాపరిషత్‌ వేదికపై మాట్లాడుతున్న మాజీ మంత్రి పుల్లారావు

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

యద్దనపూడి (మార్టూరు), జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : కళలు, కళాకారులకు, నాటక రంగాలకు కళాపరిషత్‌లు ప్రాణం పోస్తున్నాయని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఆరి ్థకంగా ఎంతకష్టమైనా కళాపరిషత్‌లను నిర్వహిస్తున్నవారిని ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో మూడోరోజు శుక్రవారం రాత్రి ప్రదర్శించిన ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ నాటిక పోటీలకు పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కళాపరిషత్‌ అధ్యక్షుడు గుదే పాండురంగారావు సభాధ్యక్షునిగా వేదికపైకి ఆహుతులను కందిమళ్ల సాంబశివరావు ఆహ్వానించారు. ఎమ్మెల్యే పుల్లారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది కళాకారులు రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన వారున్నారన్నారు. ప్రేక్షకుల చప్పట్లతో రంగస్థల కళాకారులు ఎంతోమంది తమ జీవితాలను నాటక రంగానికి అంకితం చేశారన్నారు. మనందరం కళలను బతికించుకోవాలి, కళాకారులను ప్రోత్సహించాలి, భావితరాలకు కళాపరిషత్‌లను నిర్వహించాలన్న ఆసక్తిని పెంపొందించాలన్నారు. ఇంకా ఆత్మీయ అతిథులుగా టీవీ విశ్ల్లేషకులు కందుల రమేష్‌, తెలుగు టీవీ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఆరికట్ల ప్రసాద్‌ పాల్గొన్నారు. కార్యక్రమం చివరగా టీవీ విశ్లేషకులు ఇడుపులపాటి సాంబశివరావును కళాపరిషత్‌ సభ్యులు ఎమ్మెల్యే పుల్లారావు, తదితర అతిథులతో కలిసి దుశ్శాలువ, పూలమాలలో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

Updated Date - Jan 17 , 2025 | 11:53 PM