ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విలువలు లేని వ్యక్తి జగన్‌

ABN, Publish Date - Mar 06 , 2025 | 12:38 AM

వైసీపీ అధినేత, మాజీముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిత్వం, విలువలు లేవని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ మండిపడ్డారు.

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ ధ్వజం

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధినేత, మాజీముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిత్వం, విలువలు లేవని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ మండిపడ్డారు. స్థా నిక రవిప్రియా మాల్‌లో బుధవారం రాత్రి జనసేన పార్టీ నాయకు డు కంది రవిశంకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై జగ న్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైనాట్‌ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగితే జగన్‌కు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెప్తూ 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. పదిశాతం కూడా రాని వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని జగన్‌ అడుక్కోవడం విడ్డూరంగా ఉంద ని విమర్శించారు. కన్నతల్లి, చెల్లి, రక్తసంబంధీకులు జగన్‌ను ఛీ కొడుతున్నా సిగ్గు లేకుండా పోయిందన్నారు. త్వరలో జగన్‌ను కల వాలంటే తీహార్‌ జైలుకో, చంచల్‌గూడ జైలుకో వెళ్ళాలని ఆయన ఆరోపించారు. జగన్‌ బుద్ధి మారకుంటే రానున్న ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్ర మంలో ముత్యాల కళ్యాణ్‌, రాంబాబు, రాజేష్‌, ఆలా నారాయణ యానిస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:38 AM