ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలి

ABN, Publish Date - Feb 11 , 2025 | 11:20 PM

గ్రానైట్‌ యజమానులు ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందే నని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్‌లో మంగళవారం ఆర్‌అండ్‌బీ, మైనింగ్‌, గ్రానైట్‌ యజమానులతో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

గ్రానైట్‌ యజమానులకు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సూచన

కనిగిరి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గ్రానైట్‌ యజమానులు ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందే నని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్‌లో మంగళవారం ఆర్‌అండ్‌బీ, మైనింగ్‌, గ్రానైట్‌ యజమానులతో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు. గ్రానైట్‌ వ్యర్థాలను గ్రానైట్‌ యజమానులు, నిర్వాహకులు ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని అన్నారు. దీంతో పర్యావరణ దెబ్బతినటం తోపాటు ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రజల నుంచి పదే పదే తమకు ఫిర్యాదులు వస్తున్నా యని చెప్పారు. గ్రానైట్‌ యజమానులు వ్యర్థాలను గ్రేడింగ్‌ చేసి నిర్దేశిత ప్రాంతాల్లో వేయాలన్నారు. నిబం ధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఏఈఈ ఫిరోజ్‌, మార్కా పురం మైనింగ్‌ ఏడీ విష్ణువర్ధన్‌రావు, గ్రానైట్‌ క్వారీ అ సోసియేసన్‌ నాయకులు, క్వారీ యజమానులు, క్రషర్‌, కటింగ్‌ మిషన్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో గ్రంథాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడు తూ భవిష్యత్‌ తరాలకు కూడా ఉప యోగకరంగా ఉండేలా రీడింగ్‌ రూంతో పాటు బాలికలకు వసతులు కల్పిం చేవిధంగా చూడాలని కాంట్రాక్టర్‌కు డాక్టర్‌ ఉగ్ర సూ చించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంల సంఘం నాయకులు దేవిరెడ్డి రామిరెడ్డి, ఎమ్మెస్సార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 11:20 PM