కనిగిరిలో ట్రిపుల్ ఐటీపై త్వరలో శుభవార్త
ABN, Publish Date - Jan 28 , 2025 | 02:09 AM
కనిగిరిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుపై ప్రభుత్వం త్వర లో శుభవార్త చెప్పనుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. నియోజకవర్గంలోని పీసీపల్లి, కనిగిరి మండలాల్లో సోమవారం మంత్రి స్వామి, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో కలసి విస్తృతంగా పర్యటించారు.
మంత్రి డాక్టర్ స్వామి
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కేవీపల్లి హైస్కూల్‌లో రూ.64.70 లక్షలతో అదనపు గదులు
రూ.5కోట్లతో కనిగిరి డిగ్రీ కాలేజీలో నూతన భవనం
కనిగిరి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : కనిగిరిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుపై ప్రభుత్వం త్వర లో శుభవార్త చెప్పనుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. నియోజకవర్గంలోని పీసీపల్లి, కనిగిరి మండలాల్లో సోమవారం మంత్రి స్వామి, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో కలసి విస్తృతంగా పర్యటించారు. కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పీఎం ఉష పథకం కింద రూ.5కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రి స్వామి శంకుస్థాపన చేశారు. తొలుత మంత్రి, ఎమ్మెల్యేలకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి విద్యార్థులతో మాట్లాడుతూ అదనపు తరగతి గదులు, భవనాలు, మరమ్మతులు, పరికరాలు, మౌలిక సదుపాయాల కింద కోట్లాది రూపాయలను కనిగిరి డిగ్రీ కాలేజీకి వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ద్వారా పునరుద్ధరణ ఇంధన ప్లాంట్‌ను 4వేల ఎకరాల్లో పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఎంతో దూరదృష్టితో ఈప్రాంత విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షించి ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కనిగిరిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన 7నెలల్లోనే నియోజకవర్గంలో రూ.23కోట్లతో రోడ్లు నిర్మాణం చేపట్టామన్నా రు. కనిగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బయోగ్యాస్ కంపెనీ శంకుస్థాపన సాంకేతిక ఇబ్బందుల వలన జాప్యం జరిగిందని, వాటిని అధిగమించి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అనంతరం కాలేజీ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ పి.భాస్కర్‌బాబు, డీఈఈ జగన్‌మోహన్‌రావు, డీఎల్‌డీవో శ్రీనివాసరావు, కాలేజి ప్రిన్సిపాల్ ఉషారాణి, తహసీల్దార్ రవికిషోర్, జడ్పీటీసీ సభ్యుడు కస్తూరిరెడ్డి, ఎంపీపీ ప్రకాశం, మున్సిపల్ చైర్మన్ గఫార్, టీడీపీ నాయకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, వీవీఆర్ మనోహరరావు(చిరంజీవి), రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, నారపరెడ్డి(యడవల్లి) శ్రీనివాసులురెడ్డి, బాలు ఓబులురెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, తమ్మినేని వెంకటరెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, రోషన్‌సందాని, జంషీర్ అహ్మద్, ఐవీ నారాయణ, నజిముద్దీన్, లక్ష్మయ్య, తిరుపాలు, కేవీఎ్‌సగౌడ్, ఫిరోజ్, తాతపూడి స్టాలిన్ (బుజ్జి) పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన మెనూను సక్రమంగా పాటించాలి
విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూను సక్రమంగా అందించాలని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. తొలుత మండలంలోని కంచర్లవారిపల్లి హైస్కూల్‌ను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రతో కలసి మంత్రి సందర్శించారు. హైస్కూల్ ప్రాంగణంలో పీఎంశ్రీ పథకం కింద రూ.64లక్షల 70వేలతో అదనపు తరగతి గదులు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోరిక మేరకు ఆట స్థలంలో వివిధ అభివృద్ధి పనులకు మరో రూ.5లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ టీడీపీ కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, కనిగిరి క్లస్టర్ ఇంచార్జి నారపరెడ్డి (యడవల్లి) శ్రీనివాసులురెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, సిద్దాటపు వెంకటరెడ్డి పాల్గొన్నారు
Updated Date - Jan 28 , 2025 | 02:09 AM