ఒంగోలు రైల్వేస్టేషన్‌కు మహర్దశ..!
ABN, Publish Date - Feb 04 , 2025 | 01:30 AM
రైల్వే అభివృద్ధిలో భాగంగా భారత రైల్వే శాఖ ఈనెల 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్టేషన్‌ల ఆధునికీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించింది. దేశవ్యాప్తంగా 56 స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేయగా, అందులో ఒంగోలు కూడా ఉంది.
‘అమృత్ భారత్’కు ఎంపిక
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రైల్వే అభివృద్ధిలో భాగంగా భారత రైల్వే శాఖ ఈనెల 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్టేషన్‌ల ఆధునికీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించింది. దేశవ్యాప్తంగా 56 స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేయగా, అందులో ఒంగోలు కూడా ఉంది. ఈ మేరకు ఇకపై ఒంగోలు రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మరిన్ని సేవలు అందనున్నాయి. ఆధునికమైన ప్లాట్‌ఫాం, ఏసీ వెయిటింగ్ హాల్, మొదలు నుంచి చివరి వరకు స్టేషన్ బిల్డింగ్ అభివృద్ధి, ఎయిర్‌పోర్ట్ తరహా లైటింగ్, ఆధునిక పార్కింగ్‌తోపాటు, క్యాంటీన్‌లు, మినరల్ వాటర్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ తరహాలో ప్రయాగ, అయోధ్య, షిర్డీ వంటి రైల్వే స్టేషన్‌లు అభివృద్ధి చెందాయి. అదేవిధంగా ఒంగోలు రైల్వేస్టేషన్ రూపురేఖలు కూడా మారనున్నాయి.
Updated Date - Feb 04 , 2025 | 01:30 AM