ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరనున్న తాగునీటి సమస్య

ABN, Publish Date - Feb 14 , 2025 | 12:36 AM

ఎర్రగొండపాలెం మేజరు పంచాయతీలో శివారు కాలనీలైన ఎన్టీఆర్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి పైపులైన్‌ నిర్మాణపు పనులు ప్రారంభించారు.

ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి (ఆంధ్రజ్యోతి) 13: ఎర్రగొండపాలెం మేజరు పంచాయతీలో శివారు కాలనీలైన ఎన్టీఆర్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు జోక్యంతో గురువారం పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి పైపులైన్‌ నిర్మాణపు పనులు ప్రారంభించారు. ఈ పనులకు గ్రామపంచాయతీ నిధులు నుంచి రూ.3 లక్షలు నిధులు ఖర్చు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ పైపులైన్‌ నిర్మాణంతో ఎన్టీఆర్‌ కాలనీ, ఇందిరమ్మకాలనీ, బలపాలప్యాక్టరీ కాలనీలకు సాగర్‌జలాలతో తాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. తాగునీటి సమస్య తీర్చాలని ఇటీవల రెండు కాలనీల మహిళలు ఖాళీ బిందెలతో ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన విషయం విదితమే.

Updated Date - Feb 14 , 2025 | 12:36 AM