ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిద్దలూరు - దిగువమెట్ట డబ్లిగ్‌ లైన్‌ ప్రారంభం

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:55 AM

గిద్దలూరు-దిగువమెట్ట మధ్య నూతనంగా నిర్మించిన రైల్వే డబ్లింగ్‌ లైన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. విశాఖపట్టణంలో ప్రధాని మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ. 2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్‌గా చేయగా ఇందులో గిద్దలూరు-దిగువమెట్ట మధ్య నిర్మించిన రెండో లైన్‌ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్‌ ఉంది.

రైల్వే డబ్లింగ్‌ లైన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా గిద్దలూరు స్టేషన్‌లో అధికారులు, బీజేపీ నాయకులు

విశాఖలో జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

సంబరాలు చేసిన బీజేపీ శ్రేణులు

గిద్దలూరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరు-దిగువమెట్ట మధ్య నూతనంగా నిర్మించిన రైల్వే డబ్లింగ్‌ లైన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. విశాఖపట్టణంలో ప్రధాని మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ. 2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్‌గా చేయగా ఇందులో గిద్దలూరు-దిగువమెట్ట మధ్య నిర్మించిన రెండో లైన్‌ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్‌ ఉంది. ప్రధాని అక్కడ ప్రారంభోత్సవం చేసిన సమయంలో గిద్దలూరు, దిగువమెట్ట రైల్వే స్టేషన్లలో బీజేపీ నాయకులు సంబరాలు చేశారు. ప్రారంభోత్సవ ఫ్లెక్సీల వద్ద రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు ఎ.ఉదయ్‌శంకర్‌, బీవీ రామాంజనేయులు, మట్టెమల్ల పుల్లయ్య, మునగనూరి రామకృష్ణ, రైల్వే ఉద్యోగులు ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఇప్పటికే గుంటూరు నుంచి గిద్దలూరు వరకు డబ్లింగ్‌, ఎలక్ర్టిఫికేషన్‌ పూర్తయ్యాయి. గిద్దలూరు నుంచి దిగువమెట్ట వరకు 12 కిలోమీటర్ల మేర రూ.108 కోట్లతో డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఇక గుంటూరు నుంచి దిగువమెట్ట వరకు రెండులైన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 01:55 AM