ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హామీలను సీఎం విస్మరించరు

ABN, Publish Date - Mar 08 , 2025 | 12:39 AM

గతంలో తన పుట్టినరోజున మార్కా పురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనుక డుగువేయరు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

‘గతంలో తన పుట్టినరోజున మార్కా పురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనుక డుగువేయరు. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేస్తారు. వెలిగొండ పూర్తి, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై తగిన సమయంలో నిర్ణయం ఉంటుంది. నేడు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలతో కార్యక్రమం. కార్యకర్తలంటే ఆయనకు ప్రాణం కాబట్టి కార్యకర్తల భేటీకి ప్రాధా న్యత ఇచ్చారు’ అని మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి పేర్కొ న్నారు. శనివారం మార్కాపురం వస్తున్న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లక పోవడంపై కొందరు చేస్తున్న విమర్శలపై నారాయణరెడ్డి స్పందిం చారు. ఒక ప్రశ్నకు బదులుగా నెలలో రెండు, మూడుసార్లు వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి రామానా యుడు, ఉమ్మడి జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి సమీక్ష చేసి సీఎంకు వివరిస్తున్నారని, జిల్లా ఏర్పాటుపై తగిన సమయంలో నిర్ణయం తీసుకునేం దుకు అనుగుణమైన పరిశీలన జరుగుతుం దని అన్నారు. మహిళా దినోత్సవ కార్యక్ర మాన్ని వెనుకబడిన మార్కాపురంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవటమే ఈ ప్రాంతానికి సీఎం ఇచ్చిన ప్రాధాన్యత అని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించకుండా విమర్శలు చేసే వారికి తగిన సమయంలో సమాధానం వస్తుందన్నారు. కార్యకర్తలకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తారో కార్యకర్తల సమావేశం ఏర్పాటు ద్వారా అర్థమైందని అంటూ ఈ విషయంలో బాబు నిర్ణయం పట్ల కార్యకర్తల నుంచి పూర్తిగా సంతోషం వ్యక్తమవుతుందని నారాయణరెడ్డి అన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 12:39 AM