పోతులతో చంద్రబాబు మాటామంతీ
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:31 AM
వ్యాపార నిమిత్తం విదేశాలలో ఉన్న కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కందుకూరులో చంద్రబాబు కార్యక్రమం అని తెలిసి హుటాహుటిన శనివారం కందుకూరు చేరుకున్నారు.
టంగుటూరు, ఫిబ్రవరి 15 ఆంధ్రజ్యోతి) : వ్యాపార నిమిత్తం విదేశాలలో ఉన్న కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కందుకూరులో చంద్రబాబు కార్యక్రమం అని తెలిసి హుటాహుటిన శనివారం కందుకూరు చేరుకున్నారు. విదేశా ల నుంచి హైౖదరాబాద్‌కు చేరుకున్న రామారావుకు చంద్రబాబు నుం చి పిలుపు అందడంతో విమానంలో విజయవాడ చేరుకొని అక్కడి నుంచి కారులో కందుకూరుకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు హె లిప్యాడ్ నుంచి దిగాక అక్కడే ఉన్న రామారావును పిలిచి యోగక్షేమా లు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, వ్యా పారంలో దృష్టిసారించానని పోతుల తెలిపారు. తనను కలవడం లే దుగా, అంతా లోకే్‌షతోనే సరిపోతున్నట్లుందిగా అని చంద్రబాబు చ మత్కరించారు. త్వరలో కలుద్దాం అని చెబుతూ చంద్రబాబు అక్కడి నుంచి వేరే వారి వద్దకు వెళ్లారు.
Updated Date - Feb 16 , 2025 | 12:31 AM