శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - Feb 12 , 2025 | 12:32 AM
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు అవసరమైన చోట సీసీకెమెరాలను ఏర్పాటు చేసే లా చర్యలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ సూ చించారు.
ఎస్పీ దామోదర్
నాగులుప్పలపాడు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యో తి): శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు అవసరమైన చోట సీసీకెమెరాలను ఏర్పాటు చేసే లా చర్యలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ సూ చించారు. మంగళవారం నాగులుప్పలపాడు పోలీ స్‌స్టేషన్‌ను ఆయన మంగళవారం తనిఖీ రికార్డు లను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగ తిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. దాతలు, వ్యాపారవేత్తల సహకారంతో సీసీ కెమె రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చె ప్పారు. సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని, సాంకేతిక ప రిజ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం పోలీ స్‌శాఖకు కేటాయించిన 2.14 ఎకరాల స్థలాన్ని ఎ స్పీ పరిశీలించి అందులోని ఆక్రమణలు, చిల్లచెట్లు తొలగించి రెవెన్యూ అధికారుతో హద్దులు ఏ ర్పాటు చేసి చూట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం బి.నిడమానూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ఎస్పీ దామోదర్ కొది ్దసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో డీఎస్పీ రా యపాటి శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్‌ఐ సీతారామి రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ బి.శ్రీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 12 , 2025 | 12:32 AM