ఆరేళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డులు
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:54 AM
ఆరేళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డులు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన బాల ఆధార్ నమోదు శిబిరాన్ని బుధవారం ఆమె పరిశీలించారు.
ప్రతి మండలంలో ప్రత్యేక కేంద్రాలు
కలెక్టర్ అన్సారియా వెల్లడి
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డులు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన బాల ఆధార్ నమోదు శిబిరాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఆధార్ కోసం పిల్లల వివరాలను నమోదు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బర్త్ సర్టిఫికెట్ ఉన్న పిల్లలందరికీ తక్షణమే ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. లేని వారికి తొలుత బర్త్ సర్టిఫికెట్ అధికారులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలల ఆధార్ నమోదు కోసం ప్రతి మండలంలోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Updated Date - Jan 09 , 2025 | 01:54 AM