ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మమ్మల్ని ముంచేస్తారా..?

ABN, Publish Date - Feb 11 , 2025 | 12:57 AM

పోల వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూ రు లెవెల్‌లో కుక్కునూరు మండలంలో ముంపునకు గురవుతున్న ఎనిమిది గ్రామాలకు ఇటీవల ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ ఏటా గోదావరి వరద వస్తే ముంపునకు గురవుతున్న పలు గ్రామాలకు పరి హారం అందని పరిస్థితి. ఈ గ్రామాలు 45.72 కాంటూరు లెవెల్‌లో ఉండడంతో వారికి పరిహారం అందని పరిస్థితి నెలకొంది.

ముంపు జాబితాలో లేని వంజ్యంవారిగుంపు గిరిజన గ్రామం

కుక్కునూరు మండలంలో నిర్వాసితుల ఆవేదన

ముంపునకు గురవుతున్నా.. పరిహారం దక్కని నిర్వాసిత గ్రామాలు

క్షేత్రస్థాయిలో వాస్తవ సర్వే చేయాలంటూ డిమాండ్‌

కుక్కునూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : పోల వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూ రు లెవెల్‌లో కుక్కునూరు మండలంలో ముంపునకు గురవుతున్న ఎనిమిది గ్రామాలకు ఇటీవల ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ ఏటా గోదావరి వరద వస్తే ముంపునకు గురవుతున్న పలు గ్రామాలకు పరి హారం అందని పరిస్థితి. ఈ గ్రామాలు 45.72 కాంటూరు లెవెల్‌లో ఉండడంతో వారికి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. అధికారుల అశాస్త్రీయ సర్వేలతో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోం దన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఏటా గోదావరి వరదలకు ముందుగా మండలంలో ఎల్లప్ప గూడెం, బెస్తగూడెం, కౌండిన్య ముక్తి, మాధవరం, సీతారామనగరం, అంబో తులగూడెం, చెరువుకొమ్ముగూడెం, వెంకటాపురం, రావిగూడెం, ముత్యాలమ్మపాడు, గుండంబోరు, యర్ర బోరు, లచ్చిగూడెం, ఉప్పరిమధ్యగట్ల, కుక్కునూరు బీబ్లాక్‌, కుక్కునూరు సీ.బ్లాక్‌, తదితర గ్రామాల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికి ఈ గ్రామాలేవీ 41.15 కాంటూరులో లేవు. ఇదే క్రమంలో కుక్కునూరు పంచాయతీలోని నల్లగుంట, వంజ్యం వారిగుంపు గ్రామాలు అసలు ముంపు జాబితాలోనే లేవు. దీంతో నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవు తోంది. 2022 గోదావరి వరదలకు మండలంలో దాదా పు అన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మండ లం మొత్తం యూనిట్‌గా తీసుకుని పునరావాస పరి హారం చెల్లించాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయ కులు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవంగా ఏఏ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయో వాటికి పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

తీవ్ర అన్యాయం ..

గోదావరి వస్తే పక్కనే ఉన్న కొండేటివాగు వరదతో పాటు గోదావరి వరద మమ్మల్ని ముంచెత్తు తాయి. పోలవరం ప్రాజెక్టు కడితే మా గ్రామం మునగదని చెప్పడం అధికారులకే తెలి యాలి. మాకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా గ్రామాన్ని ముంపు గ్రామాల జాబితాలో చేర్చాలి.

– కొవ్వాసి నాగార్జున, వంజ్యంవారిగుంపు

మా బతుకులంటే అంత చులకన..!

వరద ముంపునకు ముందుగా మునిగే గ్రామాల్లో మా గ్రామం ఒకటి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మా గ్రామం మునగదంటా ఇదెక్కడి సర్వేనో..? మా గ్రామాన్ని రెండో జాబితా లో తొలగించారు. భూములకే పరిహారం ఇచ్చారు. ముంపులో ఎలా ఉండాలి. న్యాయం చేయాలి.

– వంజ్యం రాజమ్మ. వంజ్యంవారిగుంపు

Updated Date - Feb 11 , 2025 | 12:58 AM