ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Akshara Andaga: అక్షరం అండగా.. పరిష్కారం దిశగా..!

ABN, Publish Date - Jan 30 , 2025 | 05:18 AM

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్‌లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాగలక్ష్మి అనే మహిళ దివ్యాంగురాలైన కుమార్తె పద్మావతికి వస్తున్న పెన్షన్‌ రూ.3వేలు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

దివ్యాంగురాలికి ఆగమేఘాలపై పెన్షన్‌

రెండున్నరేళ్లుగా తీరని సమస్యకు పరిష్కారం

‘అనంత’ ఆదర్శ కాలనీలో పారిశుధ్య కల్పన

సచివాలయాలకు సమస్యల జాబితా

విజయవాడ(మొగల్రాజపురం)/అనంతపురం క్రైం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్‌లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాగలక్ష్మి అనే మహిళ దివ్యాంగురాలైన కుమార్తె పద్మావతికి వస్తున్న పెన్షన్‌ రూ.3వేలు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం మంత్రి లోకేశ్‌ దృష్టికి రావడంతో ఆయన వెంటనే అధికారులతో మాట్లాడారు. బాధితురాలి ఇంటికి వెళ్లి వెంటనే పెన్షన్‌ మంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో స్థానిక కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌ అధికారులతో పాటు బుధవారం వారి ఇంటికి వెళ్లి పెన్షన్‌ మంజూరు చేసినట్లు చెప్పారు. దీనిపై నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్‌కు, ‘ఆంధ్రజ్యోతి’కి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఖాళీ స్థలాల్లో ముళ్ల పొదలు పెరిగాయని, విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని అనంతపురం 32వ డివిజన్‌ ఆదర్శనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొందరు ఫిర్యాదు చేశారు.


పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌.. ఎంహెచ్‌ఓ విష్ణుమూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ రెండు ఎక్స్‌కవేటర్లను బుధవారం కాలనీకి తీసుకువెళ్లి ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలను తొలగించి, శుభ్రం చేయించారు. డ్రైనేజీ కాలువల్లో పూడికను తొలగించారు. ఇదే డివిజన్‌లోని ఓబుళదేవ్‌నగర్‌, విద్యుత్‌నగర్‌, సెవెన్‌ హిల్స్‌ కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీల్లో గురువారం నుంచి పారిశుధ్య పనులు చేపడతామని ఎంహెచ్‌ఓ తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో సమస్యలు పరిష్కారమవుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల జాబితాను ఇన్‌చార్జి కమిషనర్‌ మల్లికార్జున రెడ్డి సచివాలయాలకు పంపారు. వాటిని త్వరగా పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 05:18 AM