ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సదరన సర్టిఫికెట్లలో విచిత్రాలు

ABN, Publish Date - Feb 19 , 2025 | 11:08 PM

కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక సదరన క్యాంపులు ఏర్పాటు చేస్తోంది.

ప్రభుత్వాసుపత్రిలో సదరన క్యాంప్‌

కాలు చేయి లేని వ్యక్తికి కంటిచూపు లేదని ధ్రువీకరణ పత్రం

వెరిఫికేషనలో బయటపడుతున్న అవకతవకలు

నంద్యాల హాస్పిటల్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక సదరన క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వెరిఫికేషన కోసం వికలాంగులు తమ మండల పరిషత కార్యాలయాల నుంచి నోటీసులు తీసుకుని సరిచూసుకుంటున్నారు. అయితే క్యాంపుకు వచ్చిన వికలాంగుల పత్రాలు చూసి సిబ్బంది అవాక్కయ్యారు. కాలు, చెయ్యి లేదని గతంలో సదరన క్యాంపుకు రాగా ఏకంగా ఆ వికలాంగుడిని గుడ్డి వారిని చేశారు. సదరం సర్టిఫికెట్‌లో కంటిచూపు లేదని ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఆ వికలాంగుడికి పింఛన వస్తున్నప్పటికీ ప్రస్తుత వెరిఫికేషనలో పింఛన పోతుందేమో అని ఆందోళనపడుతున్నాడు. మరో వికలాంగుడు సదరం సర్టిఫికెట్‌లో ధ్రువీకరణ పొందినప్పటికీ సచివాలయం నోటీసుతో కంటిచూపు లేదని నమోదు చేశారు. వెరిఫికేషనలో మిస్‌ మ్యాచింగ్‌ అని ధ్రువీకరించారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా ఇలాంటి మిస్‌ మ్యాచింగ్‌ బాధితులున్నారు. అఽధికారులు ఇవన్నీ సరిచేసి న్యాయం చేస్తారా? లేక పింఛన తొలగిస్తారా? అని వికలాంగులు భయపడుతున్నారు. వికలాంగులే అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సదరం క్యాంపుల్లో అస్తవ్యస్తంగా నమోదు చేయడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పున: పరిశీలన వల్ల వికలాంగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. తాము కొన్నేళ్లుగా పింఛన తీసుకుంటున్నామని, ఇప్పుడు వెరిఫికేషన చేయడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సదరన క్యాంపులో ఇలాంటి విచిత్రాలు ఎన్నో కనిపిస్తుండటంతో ఆసుపత్రి సిబ్బంది అవాక్కవుతున్నారు. వెరిఫికేషనకు హాజరుకాని వికలాంగుల పింఛన్లు నిలిపివేస్తామని నోటీసులో పేర్కొనడంతో వికలాంగులు నానా అవస్థలు పడి వెరిఫికేషనకు హాజరవుతున్నారు.

కాలూ చేయి సరిగా లేదకోతే చూపు లేదని ధృవీకరణ పత్రం ఇచ్చిరు:

ఈ ఫోటోలో కనిపిస్తున్న వికలాంగుడి పేరు గొడుగు ప్రభాకర్‌. స్వగ్రామం చాగలమర్రి మండలం ముత్యాలపాడు. ఈయనకు ఎడమ చేయి లేదు. కాలు వైకల్యం ఉంది. గతంలో సదరన క్యాంపులో దరఖాస్తు చేసుకోగా 90శాతం కంటిచూపు లేదని, 2023 డిసెంబర్‌ 22వతేదీ అధికారులు గుడ్డిగా ధ్రువీకరణపత్రం జారీచేశారు.

కంటి చూపు కోసం వెరిఫికేషన నోటీసు:

ఈయన పేరు ముల్లాషేక్షావలి. స్వగ్రామం చాగలమర్రి. ఇతనికి గతంలో వికలాంగుడిగా ధ్రువీకరణపత్రం ఉంది. అయితే ప్రస్తుతం మండల పరిషత అధికారులు ఈయనకు కంటిచూపు కోసం వెరిఫికేషన నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం ఈయన దరఖాస్తు మిస్‌ మ్యాచింగ్‌లో ఉంచారు.

Updated Date - Feb 19 , 2025 | 11:08 PM