ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila : దర్శనానికి వెళ్తే వైకుంఠానికి పంపుతారా?

ABN, Publish Date - Jan 10 , 2025 | 05:34 AM

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తే వైకుంఠానికి పంపుతారా? అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తే వైకుంఠానికి పంపుతారా? అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందడంపై గురువారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యురోదనలా? అని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలిసినా పటిష్ఠ చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యతను వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 10 , 2025 | 05:34 AM