Female Education: ఆడబిడ్డల చదువును ప్రోత్సహించాలి
ABN, Publish Date - Mar 07 , 2025 | 07:33 AM
విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, ఎస్.సవిత, జి.సంధ్యారాణి, నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, నిమ్మల పిలుపు
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, ఎస్.సవిత, జి.సంధ్యారాణి, నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆడబిడ్డల చదువును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అమరావతి సచివాలయంలో ఏపీ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని తెలిపారు. మంత్రి సవిత మాట్లాడుతూ కుటుంబాన్ని నడిపే క్రమంలో ప్రతి తల్లీ పోలీసులా వ్యవహరించాలని సూచించారు. ఆడ బిడ్డలను మగ పిల్లలతో సమానంగా పెంచాలని మంత్రి సంధ్యారాణి సూచించారు.
Updated Date - Mar 07 , 2025 | 07:33 AM