Narendra Singh Bedi : ‘ఉపాధి హామీ’ ఉద్యమకారుడు బేడీ ఇక లేరు
ABN, Publish Date - Jan 21 , 2025 | 06:55 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హక్కు ఉద్యమకారుడు నరేంద్రసింగ్ బేడీ(87) ఇక లేరు. శ్రీసత్యసాయి జిల్లా గుట్టూరులోని ఫామ్‌హౌ్‌సలో సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆయన 55 సంవత్సరాల క్రితం గుట్టూరులో యంగ్ ఇండియా సంస్థను
శ్రీసత్యసాయి జిల్లా గుట్టూరులో తుదిశ్వాస
తనకల్లు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హక్కు ఉద్యమకారుడు నరేంద్రసింగ్ బేడీ(87) ఇక లేరు. శ్రీసత్యసాయి జిల్లా గుట్టూరులోని ఫామ్‌హౌ్‌సలో సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆయన 55 సంవత్సరాల క్రితం గుట్టూరులో యంగ్ ఇండియా సంస్థను స్థాపించారు. కరువు, పేదరికానికి నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. సుస్థిర, సేంద్రియ వ్యవసాయం, ఉపాధి కల్పన ద్వారా జిల్లాను అభివృద్ధి వైపు నడిపించారు. ఉత్తమ పౌర సమాజమే లక్ష్యంగా పనిచేశారు. అసంఘటిత కార్మికులను సంఘటితం చేసి, ఎన్నో పోరాటాలను కొనసాగించారు. భూ గరిష్ఠ పరిమితి చట్టం ద్వారా పేదలకు భూములు దక్కెలా చేశారు. తనకల్లు మండలంలో వందల ఎకరాలను పేదలకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించారు. ఉపాధి హామీ పథకం కోసం ఢిల్లీకి సైకిల్ యాత్ర చేశారు. ఆయన కృషితోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూపకల్పన జరిగింది. ఆయన అంత్యక్రియలు మంగళవారం గుట్టూరులో నిర్వహిస్తారు.
Updated Date - Jan 21 , 2025 | 06:55 AM